ఏమాయ నిందుకు నీ వెగ్గులేల పట్టేవు
(॥పల్లవి॥)
ఏమాయ నిందుకు నీ వెగ్గులేల పట్టేవు
కామిని నీచెక్కు నొక్కీ కైకొనవయ్యా
(॥ఏవ॥)
పడఁతి నోరై త్తితేను పగడాలే రాసులయ్యీ
యెడపు నిన్నుఁ దిట్టితే నేమాయనయ్యా
కడలేనిరత్నాలు గానుకవచ్చిననీవు
తడవి బండారాన దాఁచుకోవటయ్యా
(॥ఏవ॥)
మగువచూపులవంక మాణిక్యాలే రాలీని
తగఁ గోపించి చూచితే తప్పటవయ్యా
సొగిసి మణులు దాఁచి సొమ్ములు నీ కిచ్చితేను
జిగి మేన ధరియించి చెలఁడవటయ్యా
(॥ఏవ॥)
ముంచి చెలి నవ్వితేను ముత్తేలే రాలీని
యించుక గేలిసేసితే నేమాయనయ్యా
పెంచెపు శ్రీవేంకటేశ పెండ్లిముత్యాలసేస
వంచి కూడి చెలి మానవచ్చునటయ్యా
(||pallavi||)
emāya niṁdugu nī vĕggulela paṭṭevu
kāmini nīsĕkku nŏkkī kaigŏnavayyā
(||eva||)
paḍam̐ti norai ttidenu pagaḍāle rāsulayyī
yĕḍabu ninnum̐ diṭṭide nemāyanayyā
kaḍaleniratnālu gānugavachchinanīvu
taḍavi baṁḍārāna dām̐sugovaḍayyā
(||eva||)
maguvasūbulavaṁka māṇikyāle rālīni
tagam̐ gobiṁchi sūside tappaḍavayyā
sŏgisi maṇulu dām̐si sŏmmulu nī kichchidenu
jigi mena dhariyiṁchi sĕlam̐ḍavaḍayyā
(||eva||)
muṁchi sĕli navvidenu muttele rālīni
yiṁchuga geliseside nemāyanayyā
pĕṁchĕbu śhrīveṁkaḍeśha pĕṁḍlimutyālasesa
vaṁchi kūḍi sĕli mānavachchunaḍayyā