ఏమాయ నీకిందుకు నేఁటికే సిగ్గు
(॥పల్లవి॥)
ఏమాయ నీకిందుకు నేఁటికే సిగ్గు
చే ముట్టి చెనకఁగాను చేయి చాఁచకుందురా
(॥ఏవ॥)
మొక్కుచు నీతో నాపె మొదలనే విన్నవించి
చెక్కునొక్కి వేఁడుకొనె సేయవైతివా
మొక్కల మింతేశాల మొగమోట మాతోనేల
వొక్కట నాపె రమ్మంటే వోపనందురా
(॥ఏవ॥)
వన్నెవెట్టు కాపె నీవద్దనే నిలుచుండె
అన్నిటాఁ బెనఁగి నీవంటవైతివా
యెన్నికలింతేశాల యెవ్వరేమనేరు నిన్ను
వున్నతి నాపె నవ్వఁగా నూరకుందురా
(॥ఏవ॥)
కందువలు నీకుఁ జూపి కాఁగిలించుకొనె నాపె
కిందుపడి నీమోవి సోఁకించవైతివా
అందపు శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
పందెము ఆపె వేయఁగా పరాకులు సేతురా
(||pallavi||)
emāya nīgiṁdugu nem̐ṭige siggu
se muṭṭi sĕnagam̐gānu seyi sām̐saguṁdurā
(||eva||)
mŏkkusu nīdo nābĕ mŏdalane vinnaviṁchi
sĕkkunŏkki vem̐ḍugŏnĕ seyavaidivā
mŏkkala miṁteśhāla mŏgamoḍa mādonela
vŏkkaḍa nābĕ rammaṁṭe vobanaṁdurā
(||eva||)
vannĕvĕṭṭu kābĕ nīvaddane nilusuṁḍĕ
anniḍām̐ bĕnam̐gi nīvaṁṭavaidivā
yĕnnigaliṁteśhāla yĕvvaremaneru ninnu
vunnadi nābĕ navvam̐gā nūraguṁdurā
(||eva||)
kaṁduvalu nīgum̐ jūbi kām̐giliṁchugŏnĕ nābĕ
kiṁdubaḍi nīmovi som̐kiṁchavaidivā
aṁdabu śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
paṁdĕmu ābĕ veyam̐gā parāgulu sedurā