(॥పల్లవి॥)
ఏమాయ నందుకు నీవే కొంకేవు
దీమసపు నీ పట్టపుదేవుల నేను
(॥ఏమా॥)
యింతవడి నీవు రాక యీడ నాడా నుంటినంటా
యెంత నన్ను వేఁడుకొనే వేమిచెప్పేది
పంతమున నీమేనఁ బచ్చిసేఁత లున్నవంటా
చెంతనున్న నాతోనేల సిగ్గువడేవు
(॥ఏమా॥)
నిలుచుంటే నాపె పచ్చి నీచెఱఁగు వట్టెనంటా
పలుమారునేల వొడఁబరచేవు
కలలో నాపెఁ గదిసి గక్కన మేలుకొని
యెలమి నామోము చూచి యేల నవ్వేవు
(॥ఏమా॥)
వూడిగపువారి మేను లొరసె ని న్నంటాను
యేడలేనియానలు నీవేల పెట్టేవు
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
జాడఁదప్పకుండా నాతో సరసమాడేవు
(||pallavi||)
emāya naṁdugu nīve kŏṁkevu
dīmasabu nī paṭṭabudevula nenu
(||emā||)
yiṁtavaḍi nīvu rāga yīḍa nāḍā nuṁṭinaṁṭā
yĕṁta nannu vem̐ḍugŏne vemisĕppedi
paṁtamuna nīmenam̐ bachchisem̐ta lunnavaṁṭā
sĕṁtanunna nādonela sigguvaḍevu
(||emā||)
nilusuṁṭe nābĕ pachchi nīsĕṟam̐gu vaṭṭĕnaṁṭā
palumārunela vŏḍam̐barasevu
kalalo nābĕm̐ gadisi gakkana melugŏni
yĕlami nāmomu sūsi yela navvevu
(||emā||)
vūḍigabuvāri menu lŏrasĕ ni nnaṁṭānu
yeḍaleniyānalu nīvela pĕṭṭevu
yīḍane śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
jāḍam̐dappaguṁḍā nādo sarasamāḍevu