ఏలుకొన్న ఫలమూ యింటి కిట్టె రావయ్య
(॥పల్లవి॥)
ఏలుకొన్న ఫలమూ యింటి కిట్టె రావయ్య
మేలుగల ఫలమూ మెచ్చఁగదవయ్యా
(॥ఏలు॥)
చెప్పినట్టువింటేనే సేసినంతఫలమూ
వొప్పుగొని నామాఁటకు నూకొనవయ్యా
యిప్పుడియ్యకొంటేనే యిచ్చినంతఫలమూ
చప్పఁగదు నాపొందు సమ్మతించవయ్యా
(॥ఏలు॥)
నావూడిగము చేకొంటే నగినంతఫలమూ
భావించి నీపాదము నాపైఁ జాఁచవయ్యా
వావి నాతోఁ జెప్పితేనే మోవియిచ్చినఫలము
యీవల నేఁ జేసేబత్తి కిటు లోనుగావయ్యా
(॥ఏలు॥)
కప్పుర మందుకొంటేనే కాఁగిలించినఫలము
దప్పిదేరీ రతికేళిఁ దనుపవయ్యా
అప్పఁడ శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
యిప్పుడు గూడినఫల మీడేరించవయ్యా
(||pallavi||)
elugŏnna phalamū yiṁṭi kiṭṭĕ rāvayya
melugala phalamū mĕchcham̐gadavayyā
(||elu||)
sĕppinaṭṭuviṁṭene sesinaṁtaphalamū
vŏppugŏni nāmām̐ṭagu nūgŏnavayyā
yippuḍiyyagŏṁṭene yichchinaṁtaphalamū
sappam̐gadu nābŏṁdu sammadiṁchavayyā
(||elu||)
nāvūḍigamu segŏṁṭe naginaṁtaphalamū
bhāviṁchi nībādamu nābaim̐ jām̐savayyā
vāvi nādom̐ jĕppidene moviyichchinaphalamu
yīvala nem̐ jesebatti kiḍu lonugāvayyā
(||elu||)
kappura maṁdugŏṁṭene kām̐giliṁchinaphalamu
dappiderī radigeḽim̐ danubavayyā
appam̐ḍa śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
yippuḍu gūḍinaphala mīḍeriṁchavayyā