పల్లవి:
మ్మ్..మ్మ్..
ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో.. రావయ్యో.. ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా...
మీగడంత నీదేలేరా బుల్లోడా
మ్మ్..మ్మ్..
ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో.. ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడూ...
ఆగడాల పిల్లోడైన నీవోడు
చరణం 1:
ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గా.. చెంగావి గన్నేరు మొగ్గా
చెయ్యేస్తే చేమంతి బుగ్గా.. చెంగావి గన్నేరు మొగ్గా
ఈడొచ్చి నీచోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడూ
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు..
గుండెల్లో చోటుంది చూడూ
మ్మ్...మ్మ్...
ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే...
ఓరయ్యో.. రావయ్యో.. ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా...
మీగడంత నీదేలేరా బుల్లోడా.. ఓ ఓ ఓ..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడూ...ఆగడాల పిల్లోడైన నీవోడూ
చరణం 2:
నీ కళ్ళు సోక నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళకోక
నీ మాట విన్న నా జారుపైట పాడిందిలే గాలిపాటా
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ..నే కోరినా మూడుముళ్ళూ
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరినా మూడుముళ్ళూ
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టీ పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టూ
నా మాటకీ యేరు తోడు..ఏరెండిన ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడూ..
మ్మ్..మ్మ్..
ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో.. ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడూ...
ఆగడాల పిల్లోడైన నీవోడు..ఆ ఆ ఆ...
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా...మీగడంత నీదేలేరా బుల్లోడా
మ్మ్..మ్మ్..