ఏలే యిందరిలోనా యెమ్మెలేఁటికే
(॥పల్లవి॥)
ఏలే యిందరిలోనా యెమ్మెలేఁటికే
నీలోని వలపులు నే మెఱఁగమా
(॥ఏలే॥)
తలవంచుకొనకువే తరుణి
చలములు పతితోడ జాళెలఁ బోసేవా
బలిమిఁ బెనఁగకువే పలుమారును
వలవనిబిగువులు వడ్డి కిచ్చేవా
(॥ఏలే॥)
పంతములాడకువే పడఁతీ
సంతతపుమాఁటలసంత పెట్టేవా
యింతేసినవ్వుల నలయించకువే
బంతినే యెగసక్యాలపైరు విత్తేవా
(॥ఏలే॥)
వేసాలు చూపకువే వెలఁదీ
పాసినకాఁకలపొందు పచరించేవా
యీసరి శ్రీవేంకటేశుఁ డేలెనిన్నును
ఆస మోవితేనెవిదు లడ్డముదోసేవా
(||pallavi||)
ele yiṁdarilonā yĕmmĕlem̐ṭige
nīloni valabulu ne mĕṟam̐gamā
(||ele||)
talavaṁchugŏnaguve taruṇi
salamulu padidoḍa jāḽĕlam̐ bosevā
balimim̐ bĕnam̐gaguve palumārunu
valavanibiguvulu vaḍḍi kichchevā
(||ele||)
paṁtamulāḍaguve paḍam̐tī
saṁtadabumām̐ṭalasaṁta pĕṭṭevā
yiṁtesinavvula nalayiṁchaguve
baṁtine yĕgasakyālabairu vittevā
(||ele||)
vesālu sūbaguve vĕlam̐dī
pāsinagām̐kalabŏṁdu pasariṁchevā
yīsari śhrīveṁkaḍeśhum̐ ḍelĕninnunu
āsa movidenĕvidu laḍḍamudosevā