ఏలే తనకు నాకు నేఁటిమాటలే । మమ్ము
(॥పల్లవి॥)
ఏలే తనకు నాకు నేఁటిమాటలే । మమ్ము
తేలించి యెడమాటాడి తీరవలెఁ గాక
(॥ఏలే॥)
లేవే నేఁ బిలిచితే లెక్కసేసీనా తాను
చావివోయ వుమినాకి చవుతమా ఇఁక
వావాత నేనుఁ దాను వాదించితే నవ్వరా
వేవేలు నాయఁబోయ వెనకకే పొందులు
(॥ఏలే॥)
ఔనె దొరతో నెదురాడవచ్చునా నాకు
మానిపండ్లు రాలితే మానికిందనే
తా నొకటి నే నొకటి తలపోఁత ఇన్నాళ్లు
నానాట మోహములు నామువేసిఁగాక
(॥ఏలే॥)
వద్దె యిఁక నాతో వట్టి వట్టి సరసాలు
అద్దో ముంజేకంకణాన కద్దనూ యిఁక
గద్దించి శ్రీ వేంకటాద్రి కడపరాయుఁడు గూడె
పొద్దు వొద్దుకు వింతైన భోగములే కాక
(||pallavi||)
ele tanagu nāgu nem̐ṭimāḍale | mammu
teliṁchi yĕḍamāḍāḍi tīravalĕm̐ gāga
(||ele||)
leve nem̐ biliside lĕkkasesīnā tānu
sāvivoya vumināgi savudamā im̐ka
vāvāda nenum̐ dānu vādiṁchide navvarā
vevelu nāyam̐boya vĕnagage pŏṁdulu
(||ele||)
aunĕ dŏrado nĕdurāḍavachchunā nāgu
mānibaṁḍlu rālide mānigiṁdane
tā nŏgaḍi ne nŏgaḍi talabom̐ta innāḽlu
nānāḍa mohamulu nāmuvesim̐gāga
(||ele||)
vaddĕ yim̐ka nādo vaṭṭi vaṭṭi sarasālu
addo muṁjegaṁkaṇāna kaddanū yim̐ka
gaddiṁchi śhrī veṁkaḍādri kaḍabarāyum̐ḍu gūḍĕ
pŏddu vŏddugu viṁtaina bhogamule kāga