Elayya neegu naagu yinnesi maadalu

ఏలయ్య నీకు నాకు యిన్నేసి మాటలు
Language

(॥పల్లవి॥)
ఏలయ్య నీకు నాకు యిన్నేసి మాటలు
మేలుగలదంతయును మెరయుఁ గాక

(॥ఏల॥)
తగులు గలుగువారు తగవులెంచనున్నదా
వెగటు లేమి సేసినా వెలయుఁగాక
తెగువులు గలవారు దిక్కులు చూడ నున్నదా
పగటులుగలవెల్లాఁ బచ్చి దేరుఁగాక

(॥ఏల॥)
మనసునమ్మినవారు మతకమెంచ నున్నదా
చనవులన్నియు లోలో జరఁగుగాక
వినయముగలవారు వెక్కసాలాడనున్నదా
పెనఁగినంతవడి బీరములౌఁగాక

(॥ఏల॥)
కాఁగిలించుకొన్నవారు కడమ వెట్టనున్నదా
చేఁగదేరఁ గూడితిమి చెల్లుఁగాక
మూఁగుచు శ్రీ వేంకటేశ ముంచి మనవంటివారు
తోఁగుఁ జమటలచేత దొమ్మియౌటఁగాక

(||pallavi||)
elayya nīgu nāgu yinnesi māḍalu
melugaladaṁtayunu mĕrayum̐ gāga

(||ela||)
tagulu galuguvāru tagavulĕṁchanunnadā
vĕgaḍu lemi sesinā vĕlayum̐gāga
tĕguvulu galavāru dikkulu sūḍa nunnadā
pagaḍulugalavĕllām̐ bachchi derum̐gāga

(||ela||)
manasunamminavāru madagamĕṁcha nunnadā
sanavulanniyu lolo jaram̐gugāga
vinayamugalavāru vĕkkasālāḍanunnadā
pĕnam̐ginaṁtavaḍi bīramulaum̐gāga

(||ela||)
kām̐giliṁchugŏnnavāru kaḍama vĕṭṭanunnadā
sem̐gaderam̐ gūḍidimi sĕllum̐gāga
mūm̐gusu śhrī veṁkaḍeśha muṁchi manavaṁṭivāru
tom̐gum̐ jamaḍalaseda dŏmmiyauḍam̐gāga