ఏల వూరకుందానవు యిట్టే నివ్వెరగుతో
(॥పల్లవి॥)
ఏల వూరకుందానవు యిట్టే నివ్వెరగుతో
మూలఁ బొద్దు వుచ్చితేను ముచ్చట వాసీనా
(॥ఏల॥)
మంతన మాడేవేళనే మాటలు వెలుచుకొని
కాంతుని చిత్తమెల్లాను కనుకోరాదా
సంతసతులలో(తో?) నెన్ని జాణతనా లాడినాను
యెంతైనా రతికేలికి నీడు వచ్చీనా
(॥ఏల॥)
పెనఁగేటి వేళనే ప్రియునిచేఇడుకొని
చెనకి సేఁతకు సేఁత సేయరాదా
యెనయక రచ్చలోన యెంత చేయి ముట్టినాను
తనువులు సోఁకినట్లు దప్పిదేరీనా
(॥ఏల॥)
భావించి కూడేవేళనే పై పైఁ బ్రియాలు చెప్పి
శ్రీ వేంకటేశు చనవు చేకొనరాదా
వొవరిలోఁగూచుండి వుపమ నెంత నవ్వినా
తావిమీకాఁగిటివలె తనివి నొందీనా
(||pallavi||)
ela vūraguṁdānavu yiṭṭe nivvĕragudo
mūlam̐ bŏddu vuchchidenu muchchaḍa vāsīnā
(||ela||)
maṁtana māḍeveḽane māḍalu vĕlusugŏni
kāṁtuni sittamĕllānu kanugorādā
saṁtasadulalo(to?) nĕnni jāṇadanā lāḍinānu
yĕṁtainā radigeligi nīḍu vachchīnā
(||ela||)
pĕnam̐geḍi veḽane priyuniseiḍugŏni
sĕnagi sem̐tagu sem̐ta seyarādā
yĕnayaga rachchalona yĕṁta seyi muṭṭinānu
tanuvulu som̐kinaṭlu dappiderīnā
(||ela||)
bhāviṁchi kūḍeveḽane pai paim̐ briyālu sĕppi
śhrī veṁkaḍeśhu sanavu segŏnarādā
vŏvarilom̐gūsuṁḍi vubama nĕṁta navvinā
tāvimīgām̐giḍivalĕ tanivi nŏṁdīnā