ఏల వేసాలు చేసేవు యెఱఁగనివానివలె
(॥పల్లవి॥)
ఏల వేసాలు చేసేవు యెఱఁగనివానివలె
ఆ లేమ వదినెయంటా నానలు వెట్టేవు
(॥ఏల॥)
నీవు నాపె యేకతాన నిలుచుండి నన్నుఁగని
చేవమీర సన్నలేల సేసేవిపుడు
దేవి దేవరావలె దిష్టముగా మిమ్ము గంటి
కావరాన నే నేమైనా కాఁతాళించి తిట్టేనా
(॥ఏల॥)
మేడమీఁద మీరిద్దరుఁ గూడియుండి నన్నుఁగని
ఆడకేల పిలిచేవు అప్పటినన్ను
వీడని దంపతులని వెస మిమ్ముఁ దెలిసితి
పాడిదప్పి నిన్నేమైనాఁ బచ్చిసేయవచ్చేనా
(॥ఏల॥)
పీఁటమీఁద నొండొరులు పెనఁగుతా నన్నుఁగని
మాటువెట్టి నన్ను నెంత మన్నించితివి
చాటి శ్రీవేంకటేశ యీసతి లక్ష్మీయనివింటి
నీటున నిన్నేమైనా నేరములెంచేనా
(||pallavi||)
ela vesālu sesevu yĕṟam̐ganivānivalĕ
ā lema vadinĕyaṁṭā nānalu vĕṭṭevu
(||ela||)
nīvu nābĕ yegadāna nilusuṁḍi nannum̐gani
sevamīra sannalela sesevibuḍu
devi devarāvalĕ diṣhṭamugā mimmu gaṁṭi
kāvarāna ne nemainā kām̐tāḽiṁchi tiṭṭenā
(||ela||)
meḍamīm̐da mīriddarum̐ gūḍiyuṁḍi nannum̐gani
āḍagela pilisevu appaḍinannu
vīḍani daṁpadulani vĕsa mimmum̐ dĕlisidi
pāḍidappi ninnemainām̐ bachchiseyavachchenā
(||ela||)
pīm̐ṭamīm̐da nŏṁḍŏrulu pĕnam̐gudā nannum̐gani
māḍuvĕṭṭi nannu nĕṁta manniṁchidivi
sāḍi śhrīveṁkaḍeśha yīsadi lakṣhmīyaniviṁṭi
nīḍuna ninnemainā neramulĕṁchenā