Ela vesaalu seseene yippumdu maadom daanu

ఏల వేసాలు సేసీనే యిప్పుఁడు మాతోఁ దాను
Language

(॥పల్లవి॥)
ఏల వేసాలు సేసీనే యిప్పుఁడు మాతోఁ దాను
వోలి నన్నిఁటికి నోర్చి వూరకుండుఁగాక

(॥ఏల॥)
చెక్కుపై గొరిడితేను సిగ్గువడఁ దనకేలే
అక్కడివారు తన్ను నాడుకొనేరా
వెక్కసపు మగవాఁడు వెఱతురా సతులకు
వుక్కుమీరి చట్టువలె నుండవలెఁగాక

(॥ఏల॥)
మెవి గంటిసేసితేను మూసుకొనివుండనేలే
తావు లెవ్వరైనాఁ జూచి తన్ను నవ్వేరా
చేవమీరిన దొర చెలులకు లోఁగుదురా
వావిరి నన్నిటా మాకెవలె నుండుఁగాక

(॥ఏల॥)
వురముపై నెక్కితేను వుదుటులు తనకేలే
తరుణులైవ్వరైనానుఁ దగదనేరా
ధర నలమేల్మంగను తాను శ్రీవేంకటేశుఁడు
అరిదిఁ బువ్వును వాసనానై యుండుఁగాక

(||pallavi||)
ela vesālu sesīne yippum̐ḍu mādom̐ dānu
voli nannim̐ṭigi norsi vūraguṁḍum̐gāga

(||ela||)
sĕkkubai gŏriḍidenu sigguvaḍam̐ danagele
akkaḍivāru tannu nāḍugŏnerā
vĕkkasabu magavām̐ḍu vĕṟadurā sadulagu
vukkumīri saṭṭuvalĕ nuṁḍavalĕm̐gāga

(||ela||)
mĕvi gaṁṭisesidenu mūsugŏnivuṁḍanele
tāvu lĕvvarainām̐ jūsi tannu navverā
sevamīrina dŏra sĕlulagu lom̐gudurā
vāviri nanniḍā māgĕvalĕ nuṁḍum̐gāga

(||ela||)
vuramubai nĕkkidenu vuduḍulu tanagele
taruṇulaivvarainānum̐ dagadanerā
dhara nalamelmaṁganu tānu śhrīveṁkaḍeśhum̐ḍu
aridim̐ buvvunu vāsanānai yuṁḍum̐gāga