Ela vemdugonevayyaa yimkaa neevu

ఏల వేఁడుకొనేవయ్యా యింకా నీవు
Language

(॥పల్లవి॥)
ఏల వేఁడుకొనేవయ్యా యింకా నీవు
చాలుకొని మొక్కే నాకు జాలి యాడది

(॥ఏల॥)
తగిలి నీరూపము తలఁపులో నుండఁగాను
వెగటైన విరహపువేద నేడది
పగటున నీపై పాటలు నోట నుండఁగా
చిగిరించేమతిలోనిచింత యేడది

(॥ఏల॥)
సొరిది నీవిచ్చినట్టిసొమ్ము నామేన నుండఁగా
కరకరిఁబెట్టు మరి కాఁకలేడవి
వెరసి నీసుడులెల్ల వినేవీనుల(లు?) నుండఁగా
అరుదైన ఆడియాస అలపేడది

(॥ఏల॥)
కలసినయిప్పటినీకాఁగిలి నా కుండఁగాను
బలిమిఁ బెనఁగేయట్టిసంతా లేడవి
నెలవై శ్రీవేంకటేశ నీవే నేనై యుండఁగాను
కులికి కులికి మరి కొస రేడది

(||pallavi||)
ela vem̐ḍugŏnevayyā yiṁkā nīvu
sālugŏni mŏkke nāgu jāli yāḍadi

(||ela||)
tagili nīrūbamu talam̐pulo nuṁḍam̐gānu
vĕgaḍaina virahabuveda neḍadi
pagaḍuna nībai pāḍalu noḍa nuṁḍam̐gā
sigiriṁchemadilonisiṁta yeḍadi

(||ela||)
sŏridi nīvichchinaṭṭisŏmmu nāmena nuṁḍam̐gā
karagarim̐bĕṭṭu mari kām̐kaleḍavi
vĕrasi nīsuḍulĕlla vinevīnula(lu?) nuṁḍam̐gā
arudaina āḍiyāsa alabeḍadi

(||ela||)
kalasinayippaḍinīgām̐gili nā kuṁḍam̐gānu
balimim̐ bĕnam̐geyaṭṭisaṁtā leḍavi
nĕlavai śhrīveṁkaḍeśha nīve nenai yuṁḍam̐gānu
kuligi kuligi mari kŏsa reḍadi