Ela vemdugoneene ne neṟumgudu namtayunu

ఏల వేఁడుకొనీనే నే నెఱుఁగుదు నంతయును
Language

(॥పల్లవి॥)
ఏల వేఁడుకొనీనే నే నెఱుఁగుదు నంతయును
కాలమందే నాపైఁ దనకరుణ యెఱఁగనా

(॥ఏల॥)
మఱవరానిమాటలు మనసున నుండఁగాను
యెఱుకతోడితగుల మేల పాసీనే
గుఱుతైనయటువంటి కొంగుము ళ్ళుండఁగాను
తెఱవమఱఁగున చింతించనేఁటికే

(॥ఏల॥)
సేసినతనసుద్దులు చెవి నిండియుండఁగాను
యీసులేల పుట్టినే యెరవేడదే
బాసలు తానిచ్చినవి బండారాన నుండఁగాను
వాసు లెంచుకొని వట్టివసివాడు లేఁటికే

(॥ఏల॥)
వొసరి తనకాఁగిలి వురము నిండుండఁగాను
గునిసిశ్రీవేంకటేశుఁ గొసరనేలే
తనిసెల మేల్మంగను తానే నేనైయుండఁగాను
పెనఁగి తను నింకాను పెరరేఁచనేఁటికే

(||pallavi||)
ela vem̐ḍugŏnīne ne nĕṟum̐gudu naṁtayunu
kālamaṁde nābaim̐ danagaruṇa yĕṟam̐ganā

(||ela||)
maṟavarānimāḍalu manasuna nuṁḍam̐gānu
yĕṟugadoḍidagula mela pāsīne
guṟudainayaḍuvaṁṭi kŏṁgumu ḽḽuṁḍam̐gānu
tĕṟavamaṟam̐guna siṁtiṁchanem̐ṭige

(||ela||)
sesinadanasuddulu sĕvi niṁḍiyuṁḍam̐gānu
yīsulela puṭṭine yĕraveḍade
bāsalu tānichchinavi baṁḍārāna nuṁḍam̐gānu
vāsu lĕṁchugŏni vaṭṭivasivāḍu lem̐ṭige

(||ela||)
vŏsari tanagām̐gili vuramu niṁḍuṁḍam̐gānu
gunisiśhrīveṁkaḍeśhum̐ gŏsaranele
tanisĕla melmaṁganu tāne nenaiyuṁḍam̐gānu
pĕnam̐gi tanu niṁkānu pĕrarem̐sanem̐ṭige