(॥పల్లవి॥)
ఏల వేగిరపడేరు ఇంత చాలదా
వేలు చూపి మెచ్చినదే వేవేలు గాదా
(॥ఏల॥)
వనితలు పెక్కుగలవల్లభునితోడుతను
చనవుగలుగుపాటే చాలు నవ్వులు
మనసుగలయుదాఁకా మంతనమబ్బిన దాఁకా
వినుకలిమాటంలే వేవేలు గాదా
(॥ఏల॥)
అన్నిటా నందరితోడా నలసినపతితోడ
చన్నులనొత్తినపాటే చాలు మేలము
విన్నపమందినదాఁకా విచ్చనవిడైనదాఁకా
వెన్నెలబాయిటికొల్పు వేవేలు గాదా
(॥ఏల॥)
సింగారాన నింటికివచ్చిన శ్రీవేంకటేశుతో
సంగడి గూచున్న పాటే చాలుఁ బ్రియాలు
అంగవించి యిట్లా న న్నలమి కూడినదాఁకా
వెంగెములేని పంతాలు వేవేలు గాదా
(||pallavi||)
ela vegirabaḍeru iṁta sāladā
velu sūbi mĕchchinade vevelu gādā
(||ela||)
vanidalu pĕkkugalavallabhunidoḍudanu
sanavugalugubāḍe sālu navvulu
manasugalayudām̐kā maṁtanamabbina dām̐kā
vinugalimāḍaṁle vevelu gādā
(||ela||)
anniḍā naṁdaridoḍā nalasinabadidoḍa
sannulanŏttinabāḍe sālu melamu
vinnabamaṁdinadām̐kā vichchanaviḍainadām̐kā
vĕnnĕlabāyiḍigŏlbu vevelu gādā
(||ela||)
siṁgārāna niṁṭigivachchina śhrīveṁkaḍeśhudo
saṁgaḍi gūsunna pāḍe sālum̐ briyālu
aṁgaviṁchi yiṭlā na nnalami kūḍinadām̐kā
vĕṁgĕmuleni paṁtālu vevelu gādā