ఏల వచ్చెనే గర్వము ఇట్టే తనకు
(॥పల్లవి॥)
ఏల వచ్చెనే గర్వము ఇట్టే తనకు
తాలిమితో నుండితేను తానే ఆఁటది
(॥ఏల॥)
పలుకుల పని యేమే పై పైనే ఆతని
తలఁపు దెలిసితేనే తానే ఆఁటది
చలములకు వచ్చె(చ్చి)నా సరసుఁ డాతనెదుట
తలఁగక నిలిచితే తానే యాఁటది
(॥ఏల॥)
కినుక యింతేసేఁటికే కెరలించి రమణుని
తనివిఁ బొందించితేను తానే యాఁటది
చనవులఁ బొరలినా సంగడినున్న వానిని
తనవోజ పట్టించితే తానే యాఁటది
(॥ఏల॥)
అప్పుడే బీరము వద్దే అందుండే వచ్చె నితఁడు
తప్పక తాఁ జూచితేనే తానే యాఁటది
యిప్పుడే శ్రీ వేంకటేశుఁ డింటిలోన నన్నుఁ గూడె
తప్పు లెంచ నోపితేను తానే యాఁటది
(||pallavi||)
ela vachchĕne garvamu iṭṭe tanagu
tālimido nuṁḍidenu tāne ām̐ṭadi
(||ela||)
palugula pani yeme pai paine ādani
talam̐pu dĕlisidene tāne ām̐ṭadi
salamulagu vachchĕ(schi)nā sarasum̐ ḍādanĕduḍa
talam̐gaga niliside tāne yām̐ṭadi
(||ela||)
kinuga yiṁtesem̐ṭige kĕraliṁchi ramaṇuni
tanivim̐ bŏṁdiṁchidenu tāne yām̐ṭadi
sanavulam̐ bŏralinā saṁgaḍinunna vānini
tanavoja paṭṭiṁchide tāne yām̐ṭadi
(||ela||)
appuḍe bīramu vadde aṁduṁḍe vachchĕ nidam̐ḍu
tappaga tām̐ jūsidene tāne yām̐ṭadi
yippuḍe śhrī veṁkaḍeśhum̐ ḍiṁṭilona nannum̐ gūḍĕ
tappu lĕṁcha nobidenu tāne yām̐ṭadi