ఏల తప్పులువట్టేవు యిట్టె నన్ను మన్నించు
(॥పల్లవి॥)
ఏల తప్పులువట్టేవు యిట్టె నన్ను మన్నించు
తాలిమితో నుండితేనే తగ నీ కుచ్చితమా
(॥ఏల॥)
నీటుననన్ని విధాలా నీచేత నేఁ దనిసితి
మాటలాడకుండితేనే మంకుఁదనమా
చీటికిమాటికి లోలో సిగ్గులనుఁ దలవంచి
గాఁటానఁ జూడకుండితే గర్వమా ఇది
(॥ఏల॥)
మలగుపై నొరగుండిమరి నీవు రాఁగాను
తలుపు మూయవచ్చితే దంటతనమా
పొలసి నీవు నన్నుఁ బూవులను వేయఁగాను
కలఁగక వుండితేనే గట్టువాయినా
(॥ఏల॥)
రట్టుగాను నీవు మాటలిట్టె నాతో నాడఁగాను
గుట్టుతోడ నుండితేనే గొంటుఁదనమా
యిట్టె శ్రీవేంకటేశ యేలి కాఁగిలించితివి
నెట్టన నిన్ను మెచ్చితేనిండినరాజసమా
(||pallavi||)
ela tappuluvaṭṭevu yiṭṭĕ nannu manniṁchu
tālimido nuṁḍidene taga nī kuchchidamā
(||ela||)
nīḍunananni vidhālā nīseda nem̐ danisidi
māḍalāḍaguṁḍidene maṁkum̐danamā
sīḍigimāḍigi lolo siggulanum̐ dalavaṁchi
gām̐ṭānam̐ jūḍaguṁḍide garvamā idi
(||ela||)
malagubai nŏraguṁḍimari nīvu rām̐gānu
talubu mūyavachchide daṁṭadanamā
pŏlasi nīvu nannum̐ būvulanu veyam̐gānu
kalam̐gaga vuṁḍidene gaṭṭuvāyinā
(||ela||)
raṭṭugānu nīvu māḍaliṭṭĕ nādo nāḍam̐gānu
guṭṭudoḍa nuṁḍidene gŏṁṭum̐danamā
yiṭṭĕ śhrīveṁkaḍeśha yeli kām̐giliṁchidivi
nĕṭṭana ninnu mĕchchideniṁḍinarājasamā