Ela talavamchugone vimtalo neevu

ఏల తలవంచుకొనే వింతలో నీవు
Language

(॥పల్లవి॥)
ఏల తలవంచుకొనే వింతలో నీవు
నీ లాగు నే నెఱుఁగుదు నీకేల వెఱపు

(॥ఏల॥)
తగవులఁ బెట్టేనా తారుకాణింవచ్చేనా
మొగము చూచి యాపెకు మొక్కితివంటా
యెగసక్కేలాడేనా యెరుకసేసుకొనేనా
పగటుటన నటు కొంగుపట్టితివంటాను

(॥ఏల॥)
తప్పులు నీపై వేసేనా తగుల నిన్నాడేనా
యిప్పుడే యీపెకుఁ గానుకిచ్చితివంటా
చొప్పులెత్తి చూపేనా సొంట్లు సోదించేనా
వొప్పుగునీమోవి నెంగి లున్నదంటాను

(॥ఏల॥)
నెపములు వెదకేనా నీచేఁతకు నవ్వేనా
వుపమించి యీడానాడా నుండితివంటా
కృపతో నన్నేలితివి కెరలి శ్రీవేంకటేశ
నిపుణత నొరసేనా నివ్వెరైతివంటాను

(||pallavi||)
ela talavaṁchugŏne viṁtalo nīvu
nī lāgu ne nĕṟum̐gudu nīgela vĕṟabu

(||ela||)
tagavulam̐ bĕṭṭenā tārugāṇiṁvachchenā
mŏgamu sūsi yābĕgu mŏkkidivaṁṭā
yĕgasakkelāḍenā yĕrugasesugŏnenā
pagaḍuḍana naḍu kŏṁgubaṭṭidivaṁṭānu

(||ela||)
tappulu nībai vesenā tagula ninnāḍenā
yippuḍe yībĕgum̐ gānugichchidivaṁṭā
sŏppulĕtti sūbenā sŏṁṭlu sodiṁchenā
vŏppugunīmovi nĕṁgi lunnadaṁṭānu

(||ela||)
nĕbamulu vĕdagenā nīsem̐tagu navvenā
vubamiṁchi yīḍānāḍā nuṁḍidivaṁṭā
kṛpado nannelidivi kĕrali śhrīveṁkaḍeśha
nibuṇada nŏrasenā nivvĕraidivaṁṭānu