ఏల తలవంచుకొనే వెఱఁగనివానివలె
(॥పల్లవి॥)
ఏల తలవంచుకొనే వెఱఁగనివానివలె
కోలుముందుగా నాపె కొలువు సేసీని
(॥ఏల॥)
సొలసి సొలసి నిన్నుఁ జూచి అల్లదె యింతి
తలపోఁతవలపుల దైలువారీని
నలిరేఁగి ముసిముసినవ్వులతో నప్పటిని
చెలులలకు నీసుద్దులు చెప్పి చూపీని
(॥ఏల॥)
మక్కువైన నీవాడేమాటలు చెవుల విని
వెక్కసపుసంతోసాన విఱ్ఱవీఁగీని
వుక్కుమీరి నీవుండేవొయ్యారిబాగులకు
అక్కరతో కోరి వేఁడీ నాసపడీని
(॥ఏల॥)
వొయ్యనే నిన్నుఁ గదిసి వూడిగాలెల్లా జేసి
తియ్యమోవి యాని దప్పిదేర్చుకొనీని
యెయ్యెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
సయ్యన నిందుకు దానూ సారెఁ బొగడీని
(||pallavi||)
ela talavaṁchugŏne vĕṟam̐ganivānivalĕ
kolumuṁdugā nābĕ kŏluvu sesīni
(||ela||)
sŏlasi sŏlasi ninnum̐ jūsi alladĕ yiṁti
talabom̐tavalabula dailuvārīni
nalirem̐gi musimusinavvulado nappaḍini
sĕlulalagu nīsuddulu sĕppi sūbīni
(||ela||)
makkuvaina nīvāḍemāḍalu sĕvula vini
vĕkkasabusaṁtosāna viṭravīm̐gīni
vukkumīri nīvuṁḍevŏyyāribāgulagu
akkarado kori vem̐ḍī nāsabaḍīni
(||ela||)
vŏyyane ninnum̐ gadisi vūḍigālĕllā jesi
tiyyamovi yāni dappidersugŏnīni
yĕyyĕḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sayyana niṁdugu dānū sārĕm̐ bŏgaḍīni