Ela sigguluvadevu yemoyi

ఏల సిగ్గులువడేవు యేమోయి
Language

(॥పల్లవి॥)
ఏల సిగ్గులువడేవు యేమోయి
వేళతోడఁ జనవిచ్చి వెసఁ గొనవోయి

(॥ఏల॥)
చెక్కుచేతితో నొకతె చింతలచిగురులమ్మీ
గుక్కకిట్టె వెలవెట్టి కొనవోయి
ముక్కుమీఁదివేలితోడ మోవిపండ్లమ్మీవి
నెక్కొన్న వలపుతోడ నీవు గొనవోయి

(॥ఏల॥)
చలికప్పుచేతులతో సతి నిమ్మపండ్లమ్మీ
కొలచినందె కొలచి కొనవోయి
వులివచ్చిసిగ్గులు వొడఁబెట్టు కమ్మీని
నిలువుసరసమున నీవు గొనవోయీ

(॥ఏల॥)
కమ్ముకొన్ననవ్వులను కప్పురపులప్పలమ్మీ
కొమ్మను కాఁగిటి రతిఁ గొనవోయీ
నెమ్మది శ్రీవేంకటేశ నీవు నన్నేలితి వాకె
నేమ్మనములోనఁ గొంత నిండుదకొనవోయీ

(||pallavi||)
ela sigguluvaḍevu yemoyi
veḽadoḍam̐ janavichchi vĕsam̐ gŏnavoyi

(||ela||)
sĕkkusedido nŏgadĕ siṁtalasigurulammī
gukkagiṭṭĕ vĕlavĕṭṭi kŏnavoyi
mukkumīm̐divelidoḍa movibaṁḍlammīvi
nĕkkŏnna valabudoḍa nīvu gŏnavoyi

(||ela||)
saligappusedulado sadi nimmabaṁḍlammī
kŏlasinaṁdĕ kŏlasi kŏnavoyi
vulivachchisiggulu vŏḍam̐bĕṭṭu kammīni
niluvusarasamuna nīvu gŏnavoyī

(||ela||)
kammugŏnnanavvulanu kappurabulappalammī
kŏmmanu kām̐giḍi radim̐ gŏnavoyī
nĕmmadi śhrīveṁkaḍeśha nīvu nannelidi vāgĕ
nemmanamulonam̐ gŏṁta niṁḍudagŏnavoyī