ఏల పిలిచేవు నన్ను యింటిలో నే నుండఁగాను
(॥పల్లవి॥)
ఏల పిలిచేవు నన్ను యింటిలో నే నుండఁగాను
ఆలనైతేనేమి యింత యగడు గావింతురా
(॥ఏల॥)
సోలసి వెరోకతెతో పొందులు నీవు సేయఁగా-
నెలయించి నే మాఁటాడేదేఁటి నేరుపు
కలసి లోలో మీరు కాఁపురాలు సేయఁగాను
వెలిఁ గాచుకుండేటివీరిడియుఁ గలదా
(॥ఏల॥)
అన్నిటాఁ బొత్తులవిడే లాపె నీవుఁ జేయఁగాను
సన్నలు నే జేసే దేటిజాణతనము
మన్ననతో మీలో మీరు మచ్చికలు సేయఁగాను
కన్నులఁ జూచేయట్టిగరితయుఁ గలదా
(॥ఏల॥)
అలమేలుమంగ నీవు నట్టే ననుపు సేయఁగా
చెలగి నే నవ్వే దెంతచెల్లుబడి
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
చలము సాదించేటిసవతియుఁ గలదా
(||pallavi||)
ela pilisevu nannu yiṁṭilo ne nuṁḍam̐gānu
ālanaidenemi yiṁta yagaḍu gāviṁturā
(||ela||)
solasi vĕrogadĕdo pŏṁdulu nīvu seyam̐gā-
nĕlayiṁchi ne mām̐ṭāḍedem̐ṭi nerubu
kalasi lolo mīru kām̐purālu seyam̐gānu
vĕlim̐ gāsuguṁḍeḍivīriḍiyum̐ galadā
(||ela||)
anniḍām̐ bŏttulaviḍe lābĕ nīvum̐ jeyam̐gānu
sannalu ne jese deḍijāṇadanamu
mannanado mīlo mīru machchigalu seyam̐gānu
kannulam̐ jūseyaṭṭigaridayum̐ galadā
(||ela||)
alamelumaṁga nīvu naṭṭe nanubu seyam̐gā
sĕlagi ne navve dĕṁtasĕllubaḍi
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
salamu sādiṁcheḍisavadiyum̐ galadā