ఏల పంతాలాడుకొనీ యెందాఁకాను
(॥పల్లవి॥)
ఏల పంతాలాడుకొనీ యెందాఁకాను
తాలి మెఱఁగదు ఱట్టు తనకేలే
(॥ఏల॥)
సిగ్గువడేదానికేలే చెనకులు మరి
యెగ్గుపట్టేదాని కేలే యేలాటాలు
అగ్గమైననుబోఁటి కందమౌఁగాక వట్టి-
తగ్గుమొగ్గు లెంచేటితనకేలే
(॥ఏల॥)
గుట్టుచూపేతనకేలే కొసరులు కడు
మట్టులేనితనకేలే మంతనములు
యిట్టె నావంటిదే యెఱుఁగుఁగాక
దట్టప్ప(పు)గర్వము దిది తనకేలే
(॥ఏల॥)
కూడెఁ దొల్లె తనకేలే కొరతలు యిట్టె
వీడెమిచ్చేతనకేలే వేసాలు
యీడనె శ్రీవేంకటేశుఁ డేలె నన్ను
తాడుపొడవుగర్వము తనకేలే
(||pallavi||)
ela paṁtālāḍugŏnī yĕṁdām̐kānu
tāli mĕṟam̐gadu ṟaṭṭu tanagele
(||ela||)
sigguvaḍedānigele sĕnagulu mari
yĕggubaṭṭedāni kele yelāḍālu
aggamainanubom̐ṭi kaṁdamaum̐gāga vaṭṭi-
taggumŏggu lĕṁcheḍidanagele
(||ela||)
guṭṭusūbedanagele kŏsarulu kaḍu
maṭṭulenidanagele maṁtanamulu
yiṭṭĕ nāvaṁṭide yĕṟum̐gum̐gāga
daṭṭappa(pu)garvamu didi tanagele
(||ela||)
kūḍĕm̐ dŏllĕ tanagele kŏradalu yiṭṭĕ
vīḍĕmichchedanagele vesālu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu
tāḍubŏḍavugarvamu tanagele