Ela paatlamdevu yimdaru nee pettum jatle

ఏల పాట్లఁడేవు యిందరు నీ పెట్టుఁ జట్లే
Language

(॥పల్లవి॥)
ఏల పాట్లఁడేవు యిందరు నీ పెట్టుఁ జట్లే
పాలు నేయైనఁ బోసేరు పైపై గొల్లెతలు

(॥ఏల॥)
అలయకుమంత నీవు అట్టె మాపై నొరగేవు
పలుసతులఁ జెనకి బడలితివి
మలగు వేసితి మదె మంచము పైఁ బవళించు
పిలిచి పెట్టేరు దామే ప్రియురాండ్లు విందులు

(॥ఏల॥)
దప్పిగొన కంత నీవు తగ మా మోవే యానేవు
వొప్పగురతుల నస్సురుసరైతివి
కప్పురము కోవి నదె కైకొను పానకమైన
కప్పే రెవ్వరైనాను కాంతలు పయ్యదలు

(॥ఏల॥)
కన్ను లార్చకంత నీవు కడునేల జోగిలేవు
కన్నెల మదాలు నీపైఁ గప్పెను నేఁడు
ఇన్నిటా శ్రీ వేంకటేశ యిటు నన్నుఁగూడితివి
పన్ని వూడిగెపువారు పాదము లొత్తేరు

(||pallavi||)
ela pāṭlam̐ḍevu yiṁdaru nī pĕṭṭum̐ jaṭle
pālu neyainam̐ boseru paibai gŏllĕdalu

(||ela||)
alayagumaṁta nīvu aṭṭĕ mābai nŏragevu
palusadulam̐ jĕnagi baḍalidivi
malagu vesidi madĕ maṁchamu paim̐ bavaḽiṁchu
pilisi pĕṭṭeru dāme priyurāṁḍlu viṁdulu

(||ela||)
dappigŏna kaṁta nīvu taga mā move yānevu
vŏppaguradula nassurusaraidivi
kappuramu kovi nadĕ kaigŏnu pānagamaina
kappe rĕvvarainānu kāṁtalu payyadalu

(||ela||)
kannu lārsagaṁta nīvu kaḍunela jogilevu
kannĕla madālu nībaim̐ gappĕnu nem̐ḍu
inniḍā śhrī veṁkaḍeśha yiḍu nannum̐gūḍidivi
panni vūḍigĕbuvāru pādamu lŏtteru