Ela nannu moramgevu yeṟamganamtaa neevu

ఏల నన్ను మొరఁగేవు యెఱఁగనంటా నీవు
Language

(॥పల్లవి॥)
ఏల నన్ను మొరఁగేవు యెఱఁగనంటా నీవు
వాలాయ మాకెఁ గూడఁగా వద్దంటినా

(॥ఏల॥)
బాయిటఁ దిరిగేయట్టిపావురాల నాకుఁజూపి
ఆయెడ నాకెతో మాటలాడేవు నీవు
చేయి నామీఁదట వేసి చెనకి పైకొంటానే
పాయలేక యాకెమీఁదఁ బాదము చాఁచేవు

(॥ఏల॥)
వమ్ముచు నీచేతి నిమ్మపండు నాముందర వేసి
కొమ్మచేత విడె మందుకొనేవు నీవు
నమ్మించి నామోము చూచి నవ్వులు నవ్వుతానే
వుమ్మడి సన్నల నాపె నొడఁబరచేవు

(॥ఏల॥)
గరిమ నివ్వలఁ గాఁగిలించుకొంటానే
తెరమాటున నాపె నొద్దికఁ గూడేవు
సిరుల శ్రీవేంకటేశ సేస నాపైఁ జల్లుతానే
మరిగిం చాపెను నీవు మర్మము లంటేవు

(||pallavi||)
ela nannu mŏram̐gevu yĕṟam̐ganaṁṭā nīvu
vālāya māgĕm̐ gūḍam̐gā vaddaṁṭinā

(||ela||)
bāyiḍam̐ dirigeyaṭṭibāvurāla nāgum̐jūbi
āyĕḍa nāgĕdo māḍalāḍevu nīvu
seyi nāmīm̐daḍa vesi sĕnagi paigŏṁṭāne
pāyalega yāgĕmīm̐dam̐ bādamu sām̐sevu

(||ela||)
vammusu nīsedi nimmabaṁḍu nāmuṁdara vesi
kŏmmaseda viḍĕ maṁdugŏnevu nīvu
nammiṁchi nāmomu sūsi navvulu navvudāne
vummaḍi sannala nābĕ nŏḍam̐barasevu

(||ela||)
garima nivvalam̐ gām̐giliṁchugŏṁṭāne
tĕramāḍuna nābĕ nŏddigam̐ gūḍevu
sirula śhrīveṁkaḍeśha sesa nābaim̐ jalludāne
marigiṁ sābĕnu nīvu marmamu laṁṭevu