ఏల నన్ను దూరేరే యెందాఁకాఁ బోరేరే
(॥పల్లవి॥)
ఏల నన్ను దూరేరే యెందాఁకాఁ బోరేరే
చాలుఁజాలు నన్నిటికి సమ్మతించే నేను
(॥ఏల॥)
అప్పుడే యాతనితో మాటాడించవద్దు గాని
చెప్పరమ్మ మీ బుద్ది సేసే నేను
చెప్పరాని చేఁతలెల్లా చెల్లఁబెట్టవద్దు గాని
వొప్పుగా మారెందుకైనా వొడఁబడే నేను
(॥ఏల॥)
దుట మమ్మిద్దరిని ఇంత రేఁచవద్దు గాని
వొదిగి నీయానలోనే వుండు నేను
ముదిరిన మా కోపములు దిద్దవద్దు గాని
యెదురాడ కెంతకైనా నియ్యకొనే నేను
(॥ఏల॥)
నాయము వెట్టిద్దిరిని నవ్వించవద్దుగాని
కాయపుఁగోప మారితేఁ గదిసే నేను
ఆయుమంటి శ్రీ వేంకటాధిపుఁడు నన్నుఁగూడె
వేయునేల మీ మాఁటే వింటిఁగదే నేను
(||pallavi||)
ela nannu dūrere yĕṁdām̐kām̐ borere
sālum̐jālu nanniḍigi sammadiṁche nenu
(||ela||)
appuḍe yādanido māḍāḍiṁchavaddu gāni
sĕpparamma mī buddi sese nenu
sĕpparāni sem̐talĕllā sĕllam̐bĕṭṭavaddu gāni
vŏppugā mārĕṁdugainā vŏḍam̐baḍe nenu
(||ela||)
duḍa mammiddarini iṁta rem̐savaddu gāni
vŏdigi nīyānalone vuṁḍu nenu
mudirina mā kobamulu diddavaddu gāni
yĕdurāḍa kĕṁtagainā niyyagŏne nenu
(||ela||)
nāyamu vĕṭṭiddirini navviṁchavaddugāni
kāyabum̐goba māridem̐ gadise nenu
āyumaṁṭi śhrī veṁkaḍādhibum̐ḍu nannum̐gūḍĕ
veyunela mī mām̐ṭe viṁṭim̐gade nenu