ఏల నన్నొడఁబరచే వెఱఁగనా నీ గుణము
(॥పల్లవి॥)
ఏల నన్నొడఁబరచే వెఱఁగనా నీ గుణము
కోలు??? ముందుగాఁ దానే కొసరీఁగాక
(॥ఏల॥)
వలెన నెవ్వతెకైనా వలచేటివాఁడవా
చెలి తాఁ జుట్టరికాలు చెప్పీఁగాక
పిలిచి వట్టి పొందులఁ బెనఁగేటివాఁడవా
చెలఁగి నీకాపె సేవసేయవచ్చీఁగాక
(॥ఏల॥)
నంటుసేసి వొకరితో నవ్వేటివాఁడవా
అంటిముట్ట(ట్టి?) తా సరసమాడీఁగాక
వెంట వెంటఁ జెక్కు నొక్కి వేఁడుకొనే వాఁడవా
దంటతనమునఁ దానే తగిలీఁగాక
(॥ఏల॥)
చేరి నీవు కెలనికిఁ జేయిచాఁచేవాఁడవా
కోరి తానే కాఁగిలించుకొనీఁగాక
కూరిమి శ్రీవేంకటేశ కూడితిని నన్ను నేఁడు
పోరచికి వచ్చి తానే పొదిగీఁగాక
(||pallavi||)
ela nannŏḍam̐barase vĕṟam̐ganā nī guṇamu
kolu??? muṁdugām̐ dāne kŏsarīm̐gāga
(||ela||)
valĕna nĕvvadĕgainā valaseḍivām̐ḍavā
sĕli tām̐ juṭṭarigālu sĕppīm̐gāga
pilisi vaṭṭi pŏṁdulam̐ bĕnam̐geḍivām̐ḍavā
sĕlam̐gi nīgābĕ sevaseyavachchīm̐gāga
(||ela||)
naṁṭusesi vŏgarido navveḍivām̐ḍavā
aṁṭimuṭṭa(ṭṭi?) tā sarasamāḍīm̐gāga
vĕṁṭa vĕṁṭam̐ jĕkku nŏkki vem̐ḍugŏne vām̐ḍavā
daṁṭadanamunam̐ dāne tagilīm̐gāga
(||ela||)
seri nīvu kĕlanigim̐ jeyisām̐sevām̐ḍavā
kori tāne kām̐giliṁchugŏnīm̐gāga
kūrimi śhrīveṁkaḍeśha kūḍidini nannu nem̐ḍu
porasigi vachchi tāne pŏdigīm̐gāga