ఏల నాతో నానతిచ్చే విచ్చకపుమాటలెల్లా
(॥పల్లవి॥)
ఏల నాతో నానతిచ్చే విచ్చకపుమాటలెల్లా
ఆలకించి లి(వి?)నఁగాక అవుఁగాదనేనా
(॥ఏల॥)
మగువకుఁ దొల్లే నీవు మాట యిచ్చినవాఁడవు
నిగిడి పొందుసేయక నీవు మానేవా
చిగిరించి పూచికాచినయట్టిమామిడి
తగఁ బండ్లు పండక తా మానీనా
(॥ఏల॥)
తేరకొన నీఇంటికిఁ దెచ్చుకొన్నవాఁడవు
గారవించి కూడక ఇంక మఱచేవా
అరనార మేనిమీఁద నలఁదినకస్తూరి
కోరి పరిమళము చేకొననంటేఁ బోవునా
(॥ఏల॥)
వొద్దఁ బెట్టుక నీపాదా లొత్తించుకొనేవాఁడవు
వొద్దికమగఁడవై నీవుండకుండేవా
కద్దులే శ్రీవేంకటేశ కలసె నలమేల్ మంగ
అద్దములో నీడవలె నంటువాసీనా
(||pallavi||)
ela nādo nānadichche vichchagabumāḍalĕllā
ālagiṁchi li(vi?)nam̐gāga avum̐gādanenā
(||ela||)
maguvagum̐ dŏlle nīvu māḍa yichchinavām̐ḍavu
nigiḍi pŏṁduseyaga nīvu mānevā
sigiriṁchi pūsigāsinayaṭṭimāmiḍi
tagam̐ baṁḍlu paṁḍaga tā mānīnā
(||ela||)
teragŏna nīiṁṭigim̐ dĕchchugŏnnavām̐ḍavu
gāraviṁchi kūḍaga iṁka maṟasevā
aranāra menimīm̐da nalam̐dinagastūri
kori parimaḽamu segŏnanaṁṭem̐ bovunā
(||ela||)
vŏddam̐ bĕṭṭuga nībādā lŏttiṁchugŏnevām̐ḍavu
vŏddigamagam̐ḍavai nīvuṁḍaguṁḍevā
kaddule śhrīveṁkaḍeśha kalasĕ nalamel maṁga
addamulo nīḍavalĕ naṁṭuvāsīnā