ఏల మమ్ముఁ జెనకేవు యెంతటివారము నేము
(॥పల్లవి॥)
ఏల మమ్ముఁ జెనకేవు యెంతటివారము నేము
మూలనుండి నీ వారమై మొక్కేము గాక
(॥ఏల॥)
యెగసక్కేలాడరాదు యెదురు మాటాడరాదు
నగనోపుదుమా నీతో నయముగాను
తగవులఁ బెట్టరాదు తారుకాణించఁగరాదు
జగడించఁగలమా చాయలా సన్నలను
(॥ఏల॥)
వరుసలడుగరాదు వలపుచల్లఁగరాదు
సరసములాడేమా సమ్మతిగాను
తరవులు వెట్టరాదు తమకించి దూరరాదు
బెరసి కాఁగిట నిన్ను బిగిఇంచఁగలమా
(॥ఏల॥)
గుట్టుసేసుకుండరాదు కూడితే మానఁగరాదు
బట్టబయలీఁది నిన్ను పనిగొనేమా
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
పట్టినచల మీడేరె పచారించఁగలమా
(||pallavi||)
ela mammum̐ jĕnagevu yĕṁtaḍivāramu nemu
mūlanuṁḍi nī vāramai mŏkkemu gāga
(||ela||)
yĕgasakkelāḍarādu yĕduru māḍāḍarādu
naganobudumā nīdo nayamugānu
tagavulam̐ bĕṭṭarādu tārugāṇiṁcham̐garādu
jagaḍiṁcham̐galamā sāyalā sannalanu
(||ela||)
varusalaḍugarādu valabusallam̐garādu
sarasamulāḍemā sammadigānu
taravulu vĕṭṭarādu tamagiṁchi dūrarādu
bĕrasi kām̐giḍa ninnu bigiiṁcham̐galamā
(||ela||)
guṭṭusesuguṁḍarādu kūḍide mānam̐garādu
baṭṭabayalīm̐di ninnu panigŏnemā
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
paṭṭinasala mīḍerĕ pasāriṁcham̐galamā