ఏల మమ్ము నొరసేవు యేలికవు నీవు మాకు
(॥పల్లవి॥)
ఏల మమ్ము నొరసేవు యేలికవు నీవు మాకు
కోలుముందుగా మేలుకొద్ది చుట్టరికము
(॥ఏల॥)
మన్ననగల కొలఁదే మందెమేళమంతయును
చన్నులు వచ్చినయంతే జవ్వనము
కన్నులు గొప్పలయితే మొగము చక్కనైమించు
విన్నవించే నేర్పుగలితే వీనుల కింపౌను
(॥ఏల॥)
బలిమిగలయంతే వంతమెల్లా నీడేరు
వలచిన పాటే వాడికయును
సెలవినవ్వులలోనే చేఁతలెల్లా నేరుపడు
పిలుపులు చవులైతే ప్రియములు నాటును
(॥ఏల॥)
వేడుకతోడి లంకె వెక్కసపుఁదమకము
వూడిగమెంత అంతే వుబ్బుఁజెమట
కూడితిని నన్ను నేఁడు కొంకక శ్రీవేంకటేశ
యీడైనరతులైతే యిచ్చకమై వుండును
(||pallavi||)
ela mammu nŏrasevu yeligavu nīvu māgu
kolumuṁdugā melugŏddi suṭṭarigamu
(||ela||)
mannanagala kŏlam̐de maṁdĕmeḽamaṁtayunu
sannulu vachchinayaṁte javvanamu
kannulu gŏppalayide mŏgamu sakkanaimiṁchu
vinnaviṁche nerbugalide vīnula kiṁpaunu
(||ela||)
balimigalayaṁte vaṁtamĕllā nīḍeru
valasina pāḍe vāḍigayunu
sĕlavinavvulalone sem̐talĕllā nerubaḍu
pilubulu savulaide priyamulu nāḍunu
(||ela||)
veḍugadoḍi laṁkĕ vĕkkasabum̐damagamu
vūḍigamĕṁta aṁte vubbum̐jĕmaḍa
kūḍidini nannu nem̐ḍu kŏṁkaga śhrīveṁkaḍeśha
yīḍainaradulaide yichchagamai vuṁḍunu