Ela ledanevu naado yitte machchamu lumdamgaa

ఏల లేదనేవు నాతో యిట్టె మచ్చము లుండఁగా
Language

(॥పల్లవి॥)
ఏల లేదనేవు నాతో యిట్టె మచ్చము లుండఁగా
పోలించి యాపె నిన్ను బొంకుమనఁబోలును

(॥ఏల॥)
అదె నీపాదాల నంటె నతివకస్తూరిబొట్టు
మొదల నీకేమిటికో మొక్కఁబోలును
కుదురుగుబ్బలమీఁదికుంకుమ నీమేన నంటె
కదిసి నీవుర మిట్టె కాఁగిలించఁబోలును

(॥ఏల॥)
వంచినశిరసుపై వాడుఁబూవులెల్లా రాలె
కొంచక రతుల నిన్నుఁ గూడఁబోలును
నించిననీచెక్కులపై నెరసెఁ దమ్ముల మటు
మంచులకళలు రేఁగ చుంబించఁబోలును

(॥ఏల॥)
వొళ్లఁబూసినపసుపు వొద్దిక నీమేన నంటె
చెల్లుబడి నీతో సాముసేయఁబోలును
యెల్లగా శ్రీవేంకటేశ యిట్టె నన్ను గూడితివి
చల్లఁగా నీకు నాపె సన్న సేయఁబోలును

(||pallavi||)
ela ledanevu nādo yiṭṭĕ machchamu luṁḍam̐gā
poliṁchi yābĕ ninnu bŏṁkumanam̐bolunu

(||ela||)
adĕ nībādāla naṁṭĕ nadivagastūribŏṭṭu
mŏdala nīgemiḍigo mŏkkam̐bolunu
kudurugubbalamīm̐diguṁkuma nīmena naṁṭĕ
kadisi nīvura miṭṭĕ kām̐giliṁcham̐bolunu

(||ela||)
vaṁchinaśhirasubai vāḍum̐būvulĕllā rālĕ
kŏṁchaga radula ninnum̐ gūḍam̐bolunu
niṁchinanīsĕkkulabai nĕrasĕm̐ dammula maḍu
maṁchulagaḽalu rem̐ga suṁbiṁcham̐bolunu

(||ela||)
vŏḽlam̐būsinabasubu vŏddiga nīmena naṁṭĕ
sĕllubaḍi nīdo sāmuseyam̐bolunu
yĕllagā śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu gūḍidivi
sallam̐gā nīgu nābĕ sanna seyam̐bolunu