ఏల కోపగించి చూచే వీతని దిక్కటే నీవు
(॥పల్లవి॥)
ఏల కోపగించి చూచే వీతని దిక్కటే నీవు
తాలిమి సేసుకొంటేఁ బంతము దప్పీనా
(॥ఏల॥)
వెక్కసపుఁగొప్పతఁడు విడిచితే నేమాయ
పెక్కునెరిఁదుమ్మిదలు బెదరీనటే
పిక్కటిల్లుఁగుచములు పిసికితే నేమాయ
యిక్కువ నందలిబిగు వింతలో మానీనా
(॥ఏల॥)
వొప్పుగా నాతఁడు నీవొడినట్టితే నేమాయ
ముప్పిరి నీపోఁకముడి ముద్రదప్పీనా
అప్పటిఁ బిరుఁదు చేతనంటితే నేమాయనే
గొప్పతన మంతలోనేకొంచమయ్యీనా
(॥ఏల॥)
శ్రీవేంకటేశుఁడు గోరఁ జెనకితే నేమాయ
సోవల నీపులకససులు వంగీనా
కైవశముసేసుకొని కలసితే నేమాయ
నీ వలమేల్మంగ వాతనికి జంటగాదా
(||pallavi||)
ela kobagiṁchi sūse vīdani dikkaḍe nīvu
tālimi sesugŏṁṭem̐ baṁtamu dappīnā
(||ela||)
vĕkkasabum̐gŏppadam̐ḍu viḍiside nemāya
pĕkkunĕrim̐dummidalu bĕdarīnaḍe
pikkaḍillum̐gusamulu pisigide nemāya
yikkuva naṁdalibigu viṁtalo mānīnā
(||ela||)
vŏppugā nādam̐ḍu nīvŏḍinaṭṭide nemāya
muppiri nībom̐kamuḍi mudradappīnā
appaḍim̐ birum̐du sedanaṁṭide nemāyane
gŏppadana maṁtalonegŏṁchamayyīnā
(||ela||)
śhrīveṁkaḍeśhum̐ḍu goram̐ jĕnagide nemāya
sovala nībulagasasulu vaṁgīnā
kaivaśhamusesugŏni kalaside nemāya
nī valamelmaṁga vādanigi jaṁṭagādā