Ela jaagulu sesevu itte raam gadavayya

ఏల జాగులు సేసేవు ఇట్టె రాఁ గదవయ్య
Language

(॥పల్లవి॥)
ఏల జాగులు సేసేవు ఇట్టె రాఁ గదవయ్య
వేళ గాచుకొని చెలి విన్నవించుమనెను

(॥ఏల॥)
చెలరేఁగి బాగాలు చేతఁ బట్టుకుండి నిన్నుఁ
బిలుచుకరమ్మని నీ ప్రియురాలు
పలు ప్రియములు చెప్పి పదివేలుగా నీకు
నలువునఁ దనమారు నన్నే మొక్కుమనెను

(॥ఏల॥)
అందముగ సోబనపు టక్షతలు నీకుఁ బెట్టి
విందు చెప్పి రమ్మనె నీ వెలఁది
మందలిం చడుగులకు మడుఁగులు వరచుక
చెంది నీ వెంటఁగొలిచి చేరువ రమ్మనెను

(॥ఏల॥)
కొత్తలుగా మోవి చవిగొందువంటా నిన్నుఁ దన
పొత్తుననుఁ బెట్టుమనె పొలఁతి
యిత్తల శ్రీ వేంకటేశ యేలితి వింతలోవచ్చి
మత్తిలి నిన్నే తాను మరిగితి ననెను.

(||pallavi||)
ela jāgulu sesevu iṭṭĕ rām̐ gadavayya
veḽa gāsugŏni sĕli vinnaviṁchumanĕnu

(||ela||)
sĕlarem̐gi bāgālu sedam̐ baṭṭuguṁḍi ninnum̐
bilusugarammani nī priyurālu
palu priyamulu sĕppi padivelugā nīgu
naluvunam̐ danamāru nanne mŏkkumanĕnu

(||ela||)
aṁdamuga sobanabu ṭakṣhadalu nīgum̐ bĕṭṭi
viṁdu sĕppi rammanĕ nī vĕlam̐di
maṁdaliṁ saḍugulagu maḍum̐gulu varasuga
sĕṁdi nī vĕṁṭam̐gŏlisi seruva rammanĕnu

(||ela||)
kŏttalugā movi savigŏṁduvaṁṭā ninnum̐ dana
pŏttunanum̐ bĕṭṭumanĕ pŏlam̐ti
yittala śhrī veṁkaḍeśha yelidi viṁtalovachchi
mattili ninne tānu marigidi nanĕnu.