Ela dooreve voorage yevvarinainaa

ఏల దూరేవే వూరకే యెవ్వరినైనా
Language

(॥పల్లవి॥)
ఏల దూరేవే వూరకే యెవ్వరినైనా
తాలిమితో నీ విభుఁడే దయఁజూచీఁ గాక

(॥ఏల॥)
అంది నీలోనివలపు లారడిఁ బెట్టీఁగాక
చందమామ నిన్ను వచ్చి సాదించీనా
కందువైన నీకోరికె కడు గుబ్బతిలీఁగాక
మందానిలుఁడు నీపై మచ్చరించీనా

(॥ఏల॥)
తలపోఁతలే నిన్ను తడఁబరచీఁగాక
చిలుకలు వచ్చి నేఁడు చిమ్మిరేఁచీనా
యెలమి నీ వయసే యింతగాఁ జేసిఁగాక
కలువపువ్వులు నిన్ను గాసిఁబెట్టీనా

(॥ఏల॥)
చేవదేరి నీచింత చెక్కుకుఁ జేయిచ్చెఁగాక
కోవిలకూఁతలు నిన్ను గుంపించెనా
శ్రీవేంకటేశుఁడు తానే చేరి నిన్నుఁ గూడెఁగాక
యీవలఁ దుమ్మిదగుంపు లెడమాట లాడెనా

(||pallavi||)
ela dūreve vūrage yĕvvarinainā
tālimido nī vibhum̐ḍe dayam̐jūsīm̐ gāga

(||ela||)
aṁdi nīlonivalabu lāraḍim̐ bĕṭṭīm̐gāga
saṁdamāma ninnu vachchi sādiṁchīnā
kaṁduvaina nīgorigĕ kaḍu gubbadilīm̐gāga
maṁdānilum̐ḍu nībai machchariṁchīnā

(||ela||)
talabom̐tale ninnu taḍam̐barasīm̐gāga
silugalu vachchi nem̐ḍu simmirem̐sīnā
yĕlami nī vayase yiṁtagām̐ jesim̐gāga
kaluvabuvvulu ninnu gāsim̐bĕṭṭīnā

(||ela||)
sevaderi nīsiṁta sĕkkugum̐ jeyichchĕm̐gāga
kovilagūm̐talu ninnu guṁpiṁchĕnā
śhrīveṁkaḍeśhum̐ḍu tāne seri ninnum̐ gūḍĕm̐gāga
yīvalam̐ dummidaguṁpu lĕḍamāḍa lāḍĕnā