Ela daamseru valabu limdaru nerimginade

ఏల దాఁచేరు వలపు లిందరు నెరిఁగినదే
Language

(॥పల్లవి॥)
ఏల దాఁచేరు వలపు లిందరు నెరిఁగినదే
వాలాయించిన పనికి వాసివంతు లున్నవా

(॥ఏల॥)
సిగ్గువడనేమిటికి చేతికి లోనై వున్నది
అగ్గలము నవ్వరాదా ఆపెతోను
వెగ్గళించి మాముందర వేసాలు చేసేవుగాక
అగ్గమై యేకతవేళ నడ్డాఁకలున్న వా

(॥ఏల॥)
తలవంచనేమిటికి తారుకాణై వున్నది
సొలసి నీకాంక్షదీరఁ జూడఁగరాదా
కొలువులోపలఁగాఁగా గుట్టు నెరపేవుగాక
మెలఁగి పానుపుమీఁద మితిమీర లున్నవా

(॥ఏల॥)
ఆస దాచ నేఁటికి ఆయము సోఁకివున్నది
సేసవెట్టి కూడరాదా శ్రీవేంకటేశ
దోసము లేదంటాఁగా దొమ్మినిందరిఁ గూడితి
లాసినయారతివేళలను పంతాలున్న వా

(||pallavi||)
ela dām̐seru valabu liṁdaru nĕrim̐ginade
vālāyiṁchina panigi vāsivaṁtu lunnavā

(||ela||)
sigguvaḍanemiḍigi sedigi lonai vunnadi
aggalamu navvarādā ābĕdonu
vĕggaḽiṁchi māmuṁdara vesālu sesevugāga
aggamai yegadaveḽa naḍḍām̐kalunna vā

(||ela||)
talavaṁchanemiḍigi tārugāṇai vunnadi
sŏlasi nīgāṁkṣhadīram̐ jūḍam̐garādā
kŏluvulobalam̐gām̐gā guṭṭu nĕrabevugāga
mĕlam̐gi pānubumīm̐da midimīra lunnavā

(||ela||)
āsa dāsa nem̐ṭigi āyamu som̐kivunnadi
sesavĕṭṭi kūḍarādā śhrīveṁkaḍeśha
dosamu ledaṁṭām̐gā dŏmminiṁdarim̐ gūḍidi
lāsinayāradiveḽalanu paṁtālunna vā