Ekkuvadakkuvalevo yeṟamga middarilona

ఎక్కువతక్కువలేవో యెఱఁగ మిద్దరిలోన
Language

(॥పల్లవి॥)
ఎక్కువతక్కువలేవో యెఱఁగ మిద్దరిలోన
వొక్కటై నీవురముపై వున్నదిదె చెలియ

(॥ఎక్కు॥)
ఆకడ జలధి దచ్చి యమృత మిచ్చితి నీవు
ఆకెకైతే మోవిఁ జీందీ నమృతము
సైకపుఁ బసిఁడీచీర సరిఁగట్టితివి నీవు
మేకొని యీకెకైతే మేనెల్లఁ బసిఁడే

(॥ఎక్కు॥)
నిగిడి కౌస్తుభపుమాణికము గట్టితి నీవు
మగువకైతే నోరెల్లా మాణికములే
బెగడి యాకసమెల్లాఁ బెద్దసేసి కొలచితి
బిగి సేయీచెలికైతేఁ బిడి కెఁడునడుమే

(॥ఎక్కు॥)
పలుమారు జలధిలోఁ బవళించితివి నీవు
కలికి గుణములోనే ఘనజలధి
యెలమి శ్రీవేంకటేశ ఇప్పుడు గూడితిగాని
జలజాక్షియైతే నిన్ను సన్నలనే కలసె

(||pallavi||)
ĕkkuvadakkuvalevo yĕṟam̐ga middarilona
vŏkkaḍai nīvuramubai vunnadidĕ sĕliya

(||ĕkku||)
āgaḍa jaladhi dachchi yamṛta michchidi nīvu
āgĕgaide movim̐ jīṁdī namṛtamu
saigabum̐ basim̐ḍīsīra sarim̐gaṭṭidivi nīvu
megŏni yīgĕgaide menĕllam̐ basim̐ḍe

(||ĕkku||)
nigiḍi kaustubhabumāṇigamu gaṭṭidi nīvu
maguvagaide norĕllā māṇigamule
bĕgaḍi yāgasamĕllām̐ bĕddasesi kŏlasidi
bigi seyīsĕligaidem̐ biḍi kĕm̐ḍunaḍume

(||ĕkku||)
palumāru jaladhilom̐ bavaḽiṁchidivi nīvu
kaligi guṇamulone ghanajaladhi
yĕlami śhrīveṁkaḍeśha ippuḍu gūḍidigāni
jalajākṣhiyaide ninnu sannalane kalasĕ