Ekkadidaagaa ee nadaga

ఎక్కడిదాకా ఈ నడక
Year
Language

పల్లవి:

ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాకా మౌనంలో మునకా
ఓ... ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాకా మౌనంలో మునకా
నీకూ తెలియకా నాకు తెలియకా
నీకూ తెలియకా నాకు తెలియకా

ఎంతసేపు ఈ రెండు మనసులకు
తికమక ఈ తికమక

ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాకా మౌనంలో మునకా

చరణం 1:

గుండె చప్పుడు వినిపించే నిశ్శబ్దమిది
కలల రంగులు కనిపించే నిశీథి ఇది
ఓ.... గుండె చప్పుడు వినిపించే నిశ్శబ్దమిది
కలల రంగులు కనిపించే నిశీథి ఇది
ఇలాంటి సమయంలో ఎలాగ పుట్టిందో
ఇలాంటి సమయంలో ఎలాగ పుట్టిందో
ఇద్దరి మధ్యన పేరు తెలియని ఈ బంధం
ఓహోహో ఇప్పటికిప్పుడు
వేరవలేని సంబంధం

ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాకా మౌనంలో మునకా

చరణం 2:

మొన్న నిన్నను మరిపించే ప్రయాణమిది
రేపు సంగతి దాచుంచే రహస్యమిది
మొన్న నిన్నను మరిపించే ప్రయాణమిది
రేపు సంగతి దాచుంచే రహస్యమిది
మరింత ఆత్రంగా మనస్సు చూస్తుంది
మరింత ఆత్రంగా మనస్సు చూస్తుంది
ఏమౌతాదో చిగురు తొడిగిన పరిచయం
ఏం చేస్తాదో బయట పడకుంది ఈ కాలం

ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాకా మౌనంలో మునకా
ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాకా మౌనంలో మునకా
నీకూ తెలియకా నాకు తెలియకా
నీకూ తెలియకా నాకు తెలియకా

ఎంతసేపు ఈ రెండు మనసులకు
తికమక ఈ తికమక

pallavi:

ĕkkaḍidāgā ī naḍaga
ĕppaḍidāgā maunaṁlo munagā
o... ĕkkaḍidāgā ī naḍaga
ĕppaḍidāgā maunaṁlo munagā
nīgū tĕliyagā nāgu tĕliyagā
nīgū tĕliyagā nāgu tĕliyagā

ĕṁtasebu ī rĕṁḍu manasulagu
tigamaga ī tigamaga

ĕkkaḍidāgā ī naḍaga
ĕppaḍidāgā maunaṁlo munagā

saraṇaṁ 1:

guṁḍĕ sappuḍu vinibiṁche niśhśhabdamidi
kalala raṁgulu kanibiṁche niśhīthi idi
o.... guṁḍĕ sappuḍu vinibiṁche niśhśhabdamidi
kalala raṁgulu kanibiṁche niśhīthi idi
ilāṁṭi samayaṁlo ĕlāga puṭṭiṁdo
ilāṁṭi samayaṁlo ĕlāga puṭṭiṁdo
iddari madhyana peru tĕliyani ī baṁdhaṁ
ohoho ippaḍigippuḍu
veravaleni saṁbaṁdhaṁ

ĕkkaḍidāgā ī naḍaga
ĕppaḍidāgā maunaṁlo munagā

saraṇaṁ 2:

mŏnna ninnanu maribiṁche prayāṇamidi
rebu saṁgadi dāsuṁche rahasyamidi
mŏnna ninnanu maribiṁche prayāṇamidi
rebu saṁgadi dāsuṁche rahasyamidi
mariṁta ātraṁgā manassu sūstuṁdi
mariṁta ātraṁgā manassu sūstuṁdi
emaudādo siguru tŏḍigina parisayaṁ
eṁ sestādo bayaḍa paḍaguṁdi ī kālaṁ

ĕkkaḍidāgā ī naḍaga
ĕppaḍidāgā maunaṁlo munagā
ĕkkaḍidāgā ī naḍaga
ĕppaḍidāgā maunaṁlo munagā
nīgū tĕliyagā nāgu tĕliyagā
nīgū tĕliyagā nāgu tĕliyagā

ĕṁtasebu ī rĕṁḍu manasulagu
tigamaga ī tigamaga