Ekkadaleni maadalu nemiseppevu

ఎక్కడలేని మాటలు నేమిచెప్పేవు
Language

(॥పల్లవి॥)
ఎక్కడలేని మాటలు నేమిచెప్పేవు
పక్కన నేము సేసినభాగ్య మిదిగాదా

(॥ఎక్క॥)
నీవద్ది కాపె వచ్చితే నిద్దుర మేలుకొంటివి
సేవసేయఁబూనితేను చెంగలించేవు
మోవి చూచినంతలోనే ముంచి నోరూరీ నీకు
వావిరి నింతానింత వలపే కాదా

(॥ఎక్క॥)
సరుసఁ గూచుండితేనే సగచోటిచ్చితివి
శిరసు దువ్వితేనే చిమ్మిరేఁగేవు
గరిమఁ బాదాలోత్తితే కడుఁ జెమరించీ నీకు
వరుసతో నింతానింతి వలుపేకాదా

(॥ఎక్క॥)
బాగాలు చేతికిచ్చితే పచ్చడము గప్పితివి
చేగదేరఁ గూడితేనే సిగ్గువడేవు
యీగతి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
వాగమైన దింతానింత వలుపే కాదా

(||pallavi||)
ĕkkaḍaleni māḍalu nemisĕppevu
pakkana nemu sesinabhāgya midigādā

(||ĕkka||)
nīvaddi kābĕ vachchide niddura melugŏṁṭivi
sevaseyam̐būnidenu sĕṁgaliṁchevu
movi sūsinaṁtalone muṁchi norūrī nīgu
vāviri niṁtāniṁta valabe kādā

(||ĕkka||)
sarusam̐ gūsuṁḍidene sagasoḍichchidivi
śhirasu duvvidene simmirem̐gevu
garimam̐ bādālottide kaḍum̐ jĕmariṁchī nīgu
varusado niṁtāniṁti valubegādā

(||ĕkka||)
bāgālu sedigichchide pachchaḍamu gappidivi
segaderam̐ gūḍidene sigguvaḍevu
yīgadi śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
vāgamaina diṁtāniṁta valube kādā