ఎక్కడ చూచినఁ దానె ఇంతులతో మెరసీని
(॥పల్లవి॥)
ఎక్కడ చూచినఁ దానె ఇంతులతో మెరసీని
చుక్కలూరి చెన్నునిఁ జూడరమ్మ చెలులు
(॥ఎక్క॥)
చెక్కుల జవ్వారితోడ చింద్రికదట్టితోడ
చొక్కమైన మాణికపు సొమ్ములతోడ
వెక్కసపు రాజసాన వేడుకకాఁడై యున్నాఁడు
చుక్కలూరి చెన్నునిఁ జూడరమ్మ చెలులు
(॥ఎక్క॥)
చక్కని మొగమువాఁడు జాజుల దండలవాఁడు
వుక్కుమీరిన నవ్వుల వుయ్యారివాఁడు
అక్కజపు సతులచే నాటపాటలు వినీని
చుక్కలూరి చెన్నునిఁ జూడరమ్మ చెలులు
(॥ఎక్క॥)
పెక్కువరా లిచ్చుకొంటా బిరుదులు చూపుకొంటా
అక్కజపు శ్రీవేంకటాద్రిపై నుండి
యిక్కువతోఁ గొలువు సేయించుకొంటా నున్నాఁడు
చుక్కలూరి చెన్నునిఁ జూడరమ్మ చెలులు
(||pallavi||)
ĕkkaḍa sūsinam̐ dānĕ iṁtulado mĕrasīni
sukkalūri sĕnnunim̐ jūḍaramma sĕlulu
(||ĕkka||)
sĕkkula javvāridoḍa siṁdrigadaṭṭidoḍa
sŏkkamaina māṇigabu sŏmmuladoḍa
vĕkkasabu rājasāna veḍugagām̐ḍai yunnām̐ḍu
sukkalūri sĕnnunim̐ jūḍaramma sĕlulu
(||ĕkka||)
sakkani mŏgamuvām̐ḍu jājula daṁḍalavām̐ḍu
vukkumīrina navvula vuyyārivām̐ḍu
akkajabu sadulase nāḍabāḍalu vinīni
sukkalūri sĕnnunim̐ jūḍaramma sĕlulu
(||ĕkka||)
pĕkkuvarā lichchugŏṁṭā birudulu sūbugŏṁṭā
akkajabu śhrīveṁkaḍādribai nuṁḍi
yikkuvadom̐ gŏluvu seyiṁchugŏṁṭā nunnām̐ḍu
sukkalūri sĕnnunim̐ jūḍaramma sĕlulu