Ekkada paraagu neegu yennilevu panulu

ఎక్కడ పరాకు నీకు యెన్నిలేవు పనులు
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకు నీకు యెన్నిలేవు పనులు
దిక్కు నీవే యిందరికి దేవరాయా

(॥ఎక్క॥)
గుత్తపుగుబ్బలాఁడి నీకొలువుకు వచ్చినది
కొత్తలుగాఁ జూడవయ్య కోడెకాఁడ
పుత్తడిబొమ్మవంటిది పూఁచి నీతో మాటలాడీ
చిత్తగించి వినవయ్య సింగారరామా

(॥ఎక్క॥)
చిమ్ముఁజూపులాఁడి యదె చిరునవ్వులు నవ్వీని
నెమ్మది లాలించవయ్య నెరతనీఁడ
పమ్మి చంద్రకళవంటిపడఁతి సన్నలు సేసీ
సమ్మతిఁ జేకొనవయ్య జాణరాయా

(॥ఎక్క॥)
కూడె నిన్నుఁ జేఁతలాఁడి కుచ్చి కాఁగిటను నించి
విడె మియ్యఁగదవయ్య వేడుకకాఁడ
పాడితో నలమేల్మంగపతివి నన్నేలితివి
చేడియ నీపె నేలుము శ్రీవేంకటరాయా

(||pallavi||)
ĕkkaḍa parāgu nīgu yĕnnilevu panulu
dikku nīve yiṁdarigi devarāyā

(||ĕkka||)
guttabugubbalām̐ḍi nīgŏluvugu vachchinadi
kŏttalugām̐ jūḍavayya koḍĕgām̐ḍa
puttaḍibŏmmavaṁṭidi pūm̐si nīdo māḍalāḍī
sittagiṁchi vinavayya siṁgārarāmā

(||ĕkka||)
simmum̐jūbulām̐ḍi yadĕ sirunavvulu navvīni
nĕmmadi lāliṁchavayya nĕradanīm̐ḍa
pammi saṁdragaḽavaṁṭibaḍam̐ti sannalu sesī
sammadim̐ jegŏnavayya jāṇarāyā

(||ĕkka||)
kūḍĕ ninnum̐ jem̐talām̐ḍi kuchchi kām̐giḍanu niṁchi
viḍĕ miyyam̐gadavayya veḍugagām̐ḍa
pāḍido nalamelmaṁgabadivi nannelidivi
seḍiya nībĕ nelumu śhrīveṁkaḍarāyā