Ekkada paraagu neegu nemtigi vachchi siggulu

ఎక్కడ పరాకు నీకు నేఁటికి వచ్చి సిగ్గులు
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకు నీకు నేఁటికి వచ్చి సిగ్గులు
మక్కువ నీపైఁ జల్లీ మాఁటలాడవయ్యా

(॥ఎక్క॥)
సానఁబట్టిన చూపులు సతి నీపై వెదచల్లి
కానుకలిచ్చీ నిదె కైకొనవయ్యా
వానల చెమటలు మైవడియంగఁ దనచన్ను
లానుకొని విన్నవించీ నాలకించవయ్యా

(॥ఎక్క॥)
సెలవుల నగవులు చిడుముడిఁ బచారించి
పలుమారు పాదాలొత్తీ పైఁజాఁచవయ్యా
లలిఁ దొడలకాంతులు వలిపెములోఁ జూపట్ట
కొలువుసేసీ యిదె చే కొనఁగదవయ్యా

(॥ఎక్క॥)
కొనగోరి తాఁకులు గురుతై ఆయములంట
యెనసి కాఁగిట నించీ నేలుకోవయ్యా
ననిచి శ్రీ వేంకటేశ నంటున సేసలు వెటీ(ట్టీ?)
వనిత యిన్నిటాఁ జనవరిఁ జేయవయ్యా

(||pallavi||)
ĕkkaḍa parāgu nīgu nem̐ṭigi vachchi siggulu
makkuva nībaim̐ jallī mām̐ṭalāḍavayyā

(||ĕkka||)
sānam̐baṭṭina sūbulu sadi nībai vĕdasalli
kānugalichchī nidĕ kaigŏnavayyā
vānala sĕmaḍalu maivaḍiyaṁgam̐ danasannu
lānugŏni vinnaviṁchī nālagiṁchavayyā

(||ĕkka||)
sĕlavula nagavulu siḍumuḍim̐ basāriṁchi
palumāru pādālŏttī paim̐jām̐savayyā
lalim̐ dŏḍalagāṁtulu valibĕmulom̐ jūbaṭṭa
kŏluvusesī yidĕ se kŏnam̐gadavayyā

(||ĕkka||)
kŏnagori tām̐kulu gurudai āyamulaṁṭa
yĕnasi kām̐giḍa niṁchī nelugovayyā
nanisi śhrī veṁkaḍeśha naṁṭuna sesalu vĕḍī(ṭṭī?)
vanida yinniḍām̐ janavarim̐ jeyavayyā