Ekkada paraago neegu neṟamgamu

ఎక్కడ పరాకో నీకు నెఱఁగము
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకో నీకు నెఱఁగము
యిక్కువఁ గొలువుసేసే మిదివో నేము

(॥ఎక్కు॥)
పట్టెమంచము మీఁదటఁ బవ్వళించి నీ వుండఁగ
అట్టె పాదాలొత్తీ నాకె అండఁగూచుండి
చిట్టంటుసేఁతల నీకు సేవసేసేరు గొందరు
ముట్టి సారెసారె నీకు మొక్కేము నేము

(॥ఎక్క॥)
చేతి మీఁద నీవిట్టె శిరసు వెట్టుకుండఁగా
యీతలను తొడచాఁచె నీకె నొకతె
కాతరాన వేళ్లఁ జిటుకలుదీసేరు గొందరు
జాతిగా నీమేను చూచి సంతోసించేము నేము

(॥ఎక్క॥)
పన్ని యలమేలుమంగ పైపై సన్నలుసేయఁగా
వున్నది శ్రీవేంకటేశ వురముమీఁద
వన్నెలతో నిరుమేలా వలపించేరు గొందరు
మన్నించి మమ్మేలితివి మలసేము నేము

(||pallavi||)
ĕkkaḍa parāgo nīgu nĕṟam̐gamu
yikkuvam̐ gŏluvusese midivo nemu

(||ĕkku||)
paṭṭĕmaṁchamu mīm̐daḍam̐ bavvaḽiṁchi nī vuṁḍam̐ga
aṭṭĕ pādālŏttī nāgĕ aṁḍam̐gūsuṁḍi
siṭṭaṁṭusem̐tala nīgu sevaseseru gŏṁdaru
muṭṭi sārĕsārĕ nīgu mŏkkemu nemu

(||ĕkka||)
sedi mīm̐da nīviṭṭĕ śhirasu vĕṭṭuguṁḍam̐gā
yīdalanu tŏḍasām̐sĕ nīgĕ nŏgadĕ
kādarāna veḽlam̐ jiḍugaludīseru gŏṁdaru
jādigā nīmenu sūsi saṁtosiṁchemu nemu

(||ĕkka||)
panni yalamelumaṁga paibai sannaluseyam̐gā
vunnadi śhrīveṁkaḍeśha vuramumīm̐da
vannĕlado nirumelā valabiṁcheru gŏṁdaru
manniṁchi mammelidivi malasemu nemu