ఎక్కడ నేరుచుకొంటి విటువంటి కతలు
(॥పల్లవి॥)
ఎక్కడ నేరుచుకొంటి విటువంటి కతలు
మొక్కలపు దలపులు మోచుకొనఁగలవా
(॥ఎక్క॥)
పొత్తులమాట లాడదేవు పూఁచి యేడ నేర్పితివో
బత్తితో నెవ్వరిపని పంచుకొందుము
మొత్తమై యందరుఁ గూడి మొనచన్నుల నొత్తితే
పుత్తలపడక నీవు వోరుపఁగలవా
(॥ఎక్క॥)
మూఁకలచూపులు చూచే మోపులకొలఁదులుగ
తేఁకువ నెట్టేర్పరచి తీసుకొందుము
కాఁకల నిన్నొకమాఁటా కాంతలు కాఁగిలించితే
యేఁకట వేసరక నీ వెదురుకొనఁగలవా
(॥ఎక్క॥)
మూఁటనవ్వులు నవ్వేవు మొగి నిచ్చకుండాను
యేఁట యెందు మోచునని ఇయ్యకొందుము
కూటమి నిన్నిందరముఁ గూడి పెండ్లాడితిమి
పాటించి శ్రీవేంకటేశ బాసలియ్యఁగలవా
(||pallavi||)
ĕkkaḍa nerusugŏṁṭi viḍuvaṁṭi kadalu
mŏkkalabu dalabulu mosugŏnam̐galavā
(||ĕkka||)
pŏttulamāḍa lāḍadevu pūm̐si yeḍa nerbidivo
battido nĕvvaribani paṁchugŏṁdumu
mŏttamai yaṁdarum̐ gūḍi mŏnasannula nŏttide
puttalabaḍaga nīvu vorubam̐galavā
(||ĕkka||)
mūm̐kalasūbulu sūse mobulagŏlam̐duluga
tem̐kuva nĕṭṭerbarasi tīsugŏṁdumu
kām̐kala ninnŏgamām̐ṭā kāṁtalu kām̐giliṁchide
yem̐kaḍa vesaraga nī vĕdurugŏnam̐galavā
(||ĕkka||)
mūm̐ṭanavvulu navvevu mŏgi nichchaguṁḍānu
yem̐ṭa yĕṁdu mosunani iyyagŏṁdumu
kūḍami ninniṁdaramum̐ gūḍi pĕṁḍlāḍidimi
pāḍiṁchi śhrīveṁkaḍeśha bāsaliyyam̐galavā