ఎక్కడ దెచ్చితివయ్యా యీపెను నీవు
(॥పల్లవి॥)
ఎక్కడ దెచ్చితివయ్యా యీపెను నీవు
వెక్కసముగా నీకు విడేలిచ్చీని
(॥ఎక్క॥)
పట్టపగలే నీకు పాదాలు గుద్దుతాను
చుట్టరికములు చెప్పీ సుదతి
నట్టనడుమఁ గూచుండి నవ్వులు నవ్వుకొంటాను
వట్టి వూడిగాలునేసీ పలుమారు నీకు
(॥ఎక్క॥)
పూని పట్టుకొని వచ్చి పువ్వులు ముడిచేనంటా -
నానుక చన్నుల నొత్తి నంగన
తానే మొగము చూచి తగ సిగ్గువడుకొంటా
మోనమునఁ దేనెలూరేమోవి చూపీ నీకు
(॥ఎక్క॥)
పైపైఁ దెరవేసుక పాఁతపెండ్లికూఁతరై
కాఁపురముసేసీ నీకుఁ గలికి
ఆఁపక శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
నాపొందు సేయఁగఁ దానూ నాఁటుకొనీ నీకు
(||pallavi||)
ĕkkaḍa dĕchchidivayyā yībĕnu nīvu
vĕkkasamugā nīgu viḍelichchīni
(||ĕkka||)
paṭṭabagale nīgu pādālu guddudānu
suṭṭarigamulu sĕppī sudadi
naṭṭanaḍumam̐ gūsuṁḍi navvulu navvugŏṁṭānu
vaṭṭi vūḍigālunesī palumāru nīgu
(||ĕkka||)
pūni paṭṭugŏni vachchi puvvulu muḍisenaṁṭā -
nānuga sannula nŏtti naṁgana
tāne mŏgamu sūsi taga sigguvaḍugŏṁṭā
monamunam̐ denĕlūremovi sūbī nīgu
(||ĕkka||)
paibaim̐ dĕravesuga pām̐tabĕṁḍligūm̐tarai
kām̐puramusesī nīgum̐ galigi
ām̐paga śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
nābŏṁdu seyam̐gam̐ dānū nām̐ṭugŏnī nīgu