Eggo tappogaani yivivo maasemtalu

ఎగ్గో తప్పోకాని యివివో మాచేఁతలు
Language

(॥పల్లవి॥)
ఎగ్గో తప్పోకాని యివివో మాచేఁతలు
అగ్గపు రమణుఁడ నే మంతేసి యెఱఁగము

(॥ఎగ్గొ॥)
నీవు నన్ను మన్నించఁగా నిన్నుఁ గొసరితిఁగాక
వేవేగఁ బనిలేదంటే వేసరించేనా
తావివసంతము రాఁగాఁ గోవిల గూసెఁగాక
వావాతా నారునెలలు వాయెతైనా

(॥ఎగ్గొ॥)
కన్నుల నీవు చూడఁగఁ గాఁకలఁ గోరితిఁగాక
యెన్నిక నీ వెందోవుంటే నింత వేఁడేనా
వెన్నెలకుఁ జకోరము వేడుకపడెఁగాక
నన్నెల యెండగాయఁగ వచ్చితలయెతైనా

(॥ఎగ్గొ॥)
ఆయము నీ వంటఁగాను అట్టే నేఁ గూడితిఁగాక
బాయిట నల్లంత నుంటే పైకోనేవా
వేయైన శ్రీవేంకటేశ విరులకుఁ దుమ్మిదలు
మ్రోయుఁగాక చిగురులమూఁకలకు మ్రోసునా

(||pallavi||)
ĕggo tappogāni yivivo māsem̐talu
aggabu ramaṇum̐ḍa ne maṁtesi yĕṟam̐gamu

(||ĕggŏ||)
nīvu nannu manniṁcham̐gā ninnum̐ gŏsaridim̐gāga
vevegam̐ baniledaṁṭe vesariṁchenā
tāvivasaṁtamu rām̐gām̐ govila gūsĕm̐gāga
vāvādā nārunĕlalu vāyĕdainā

(||ĕggŏ||)
kannula nīvu sūḍam̐gam̐ gām̐kalam̐ goridim̐gāga
yĕnniga nī vĕṁdovuṁṭe niṁta vem̐ḍenā
vĕnnĕlagum̐ jagoramu veḍugabaḍĕm̐gāga
nannĕla yĕṁḍagāyam̐ga vachchidalayĕdainā

(||ĕggŏ||)
āyamu nī vaṁṭam̐gānu aṭṭe nem̐ gūḍidim̐gāga
bāyiḍa nallaṁta nuṁṭe paigonevā
veyaina śhrīveṁkaḍeśha virulagum̐ dummidalu
mroyum̐gāga sigurulamūm̐kalagu mrosunā