Eggo tappo neneṟamganayyaa

ఎగ్గో తప్పో నేనెఱఁగనయ్యా
Language

(॥పల్లవి॥)
ఎగ్గో తప్పో నేనెఱఁగనయ్యా
సిగ్గు విడిపించఁగాను చెక్కు నొక్కితి

(॥ఎగ్గో॥)
చనవు గలుగఁగానుసారెసారెఁ బెనఁగితి
ననుపు గలుగఁగాను నవ్వితిని
కనుఁగొని చూడఁగానుకదిసికూచుండితి
మనసునీ వియ్యఁగాను మాటలాడితి

(॥ఎగ్గో॥)
సన్నలు సేయఁగాను సరసములాడితి
చన్నుల గోరొత్తఁగాను సమ్మతించితి
మన్నించి నీ వంటఁగాను మంతనాన కియ్యకొంటి
యెన్నిక నీవు సేయఁగా నిరవైతిని

(॥ఎగ్గో॥)
కలసి మెలశుండఁగా గాఁపురము సేసితి
చలివాయు నీమోవి చవిగొంటిని
యెలమి శ్రీవేంకటేశ యిప్పుడూనుఁ గూడితిని
తెలుపఁగ నీపట్టుపుదేవుల నేనైతిని

(||pallavi||)
ĕggo tappo nenĕṟam̐ganayyā
siggu viḍibiṁcham̐gānu sĕkku nŏkkidi

(||ĕggo||)
sanavu galugam̐gānusārĕsārĕm̐ bĕnam̐gidi
nanubu galugam̐gānu navvidini
kanum̐gŏni sūḍam̐gānugadisigūsuṁḍidi
manasunī viyyam̐gānu māḍalāḍidi

(||ĕggo||)
sannalu seyam̐gānu sarasamulāḍidi
sannula gorŏttam̐gānu sammadiṁchidi
manniṁchi nī vaṁṭam̐gānu maṁtanāna kiyyagŏṁṭi
yĕnniga nīvu seyam̐gā niravaidini

(||ĕggo||)
kalasi mĕlaśhuṁḍam̐gā gām̐puramu sesidi
salivāyu nīmovi savigŏṁṭini
yĕlami śhrīveṁkaḍeśha yippuḍūnum̐ gūḍidini
tĕlubam̐ga nībaṭṭubudevula nenaidini