Eggauno tappauno yemeenanamgamjaala

ఎగ్గౌనో తప్పౌనో యేమీననఁగఁజాల
Language

(॥పల్లవి॥)
ఎగ్గౌనో తప్పౌనో యేమీననఁగఁజాల
అగ్గలపు నీచిత్త మానతియ్యవయ్యా

(॥ఎగ్గౌ॥)
అంటుదునో ఆంటవద్దో ఆయము సోఁకెననేవో
వెంట వత్తునో వద్దో వెంగెమనేవో
జఁటై వుందునో వద్దో సారె నమ్మలేవఁననేవో
బంట పంతాలికఁనేల పలుకఁగదయ్యా

(॥ఎగ్గౌ॥)
ఆడుదునో ఆడవద్దో ఆఱడిసేసేననేవో
వీడెమిత్తునో వద్దో వేసటనేవో
కూడఁజింతింతునో వద్దో గుట్టు నేఁ గనేననేవో
యీడనే నీగుణ మింతా నెఱిఁగించవయ్యా

(॥ఎగ్గౌ॥)
పక్కకు వత్తునో వద్దో బాసదప్పించెననేవో
మొక్కుదునో వద్దో నీవే ముంచేవ నేవో
పక్కన శ్రీ వేంకటేశ పైపైనే కూడితివి
అక్కున నుందాన బుద్దు లానతియ్యవయ్యా

(||pallavi||)
ĕggauno tappauno yemīnanam̐gam̐jāla
aggalabu nīsitta mānadiyyavayyā

(||ĕggau||)
aṁṭuduno āṁṭavaddo āyamu som̐kĕnanevo
vĕṁṭa vattuno vaddo vĕṁgĕmanevo
jam̐ṭai vuṁduno vaddo sārĕ nammalevam̐nanevo
baṁṭa paṁtāligam̐nela palugam̐gadayyā

(||ĕggau||)
āḍuduno āḍavaddo āṟaḍisesenanevo
vīḍĕmittuno vaddo vesaḍanevo
kūḍam̐jiṁtiṁtuno vaddo guṭṭu nem̐ ganenanevo
yīḍane nīguṇa miṁtā nĕṟim̐giṁchavayyā

(||ĕggau||)
pakkagu vattuno vaddo bāsadappiṁchĕnanevo
mŏkkuduno vaddo nīve muṁcheva nevo
pakkana śhrī veṁkaḍeśha paibaine kūḍidivi
akkuna nuṁdāna buddu lānadiyyavayyā