Egasakke laadanera yichchagamu laadanoba

ఎగసక్కే లాడనేర యిచ్చకము లాడనోప
Language

(॥పల్లవి॥)
ఎగసక్కే లాడనేర యిచ్చకము లాడనోప
జగడాలు మాని యింక చక్కనుండుమనవే

(॥॥)
చెలిమిసేసేవాఁడైతే చేఁతకల్లా లోనౌఁగాక
మలకలమలకలమాట లేఁటికే
వలపెల్లా నాసొమ్ము వట్టిసట దనసొమ్ము
చలము లింకానేల చక్కనుండుమనవే

(॥॥)
తప్పులేనివాఁడైతే తాలిమితో నుండుఁగాక
అప్పటిని యింతేసియాన లేఁటికే
యెప్పుడూ నేఁదనదాన యెవ్వరివాఁడో తాను
చప్పుడు సేయక యిఁక చక్కనుండుమనవే

(॥॥)
సమ్మతించినవాఁడైతే చనవిచ్చి కూడుఁగాక
కమ్మటి రేపుమాపని గడు వేఁటికే
తమ్మిపువ్వుకాంతను తాశ్రీవేంకటేశుఁడు
సమ్మదము లోనగూడె చక్కనుండుమనవే

(||pallavi||)
ĕgasakke lāḍanera yichchagamu lāḍanoba
jagaḍālu māni yiṁka sakkanuṁḍumanave

(||||)
sĕlimisesevām̐ḍaide sem̐tagallā lonaum̐gāga
malagalamalagalamāḍa lem̐ṭige
valabĕllā nāsŏmmu vaṭṭisaḍa danasŏmmu
salamu liṁkānela sakkanuṁḍumanave

(||||)
tappulenivām̐ḍaide tālimido nuṁḍum̐gāga
appaḍini yiṁtesiyāna lem̐ṭige
yĕppuḍū nem̐danadāna yĕvvarivām̐ḍo tānu
sappuḍu seyaga yim̐ka sakkanuṁḍumanave

(||||)
sammadiṁchinavām̐ḍaide sanavichchi kūḍum̐gāga
kammaḍi rebumābani gaḍu vem̐ṭige
tammibuvvugāṁtanu tāśhrīveṁkaḍeśhum̐ḍu
sammadamu lonagūḍĕ sakkanuṁḍumanave