ఏకతానఁ జేయరాదా ఇటువంటి సుద్దులెల్లా
(॥పల్లవి॥)
ఏకతానఁ జేయరాదా ఇటువంటి సుద్దులెల్లా
యీకడాకడవారి కెమ్మెలై తోఁచును
(॥ఏక॥)
చెలరేఁగిచేఁగి చెప్పె నీ కాపె సుద్దులు
నలువంక నీవూ నవ్వే వందుకు
మెలఁగి మీసుద్దు లివి మీకే చవులుగాని
కెలవి సవతులను గేలియై తోఁచును
(॥ఏక॥)
దగ్గరి దగ్గరి ఆపె తగ సేవసేసీ నీకు
అగ్గమై నీ నందుకెల్లా ఆనందించేవు
యెగ్గు సిగ్గులేక మీకే యితవులై వుండుఁగాని
వొగ్గిన నీలేమలకు వొరటులై తోఁచును
(॥ఏక॥)
కమ్మటిఁ గమ్మటి నాపె కాఁగిలించి కూడఁగాను
సమ్మతించి నీనందుకు చనవిచ్చేవు
ఇమ్ముల శ్రీవేంకటేశ యింపు మీకేయౌఁగాని
దొమ్మిగాఁగూడినమాకు తోడునీడై తోఁచును
(||pallavi||)
egadānam̐ jeyarādā iḍuvaṁṭi suddulĕllā
yīgaḍāgaḍavāri kĕmmĕlai tom̐sunu
(||ega||)
sĕlarem̐gisem̐gi sĕppĕ nī kābĕ suddulu
naluvaṁka nīvū navve vaṁdugu
mĕlam̐gi mīsuddu livi mīge savulugāni
kĕlavi savadulanu geliyai tom̐sunu
(||ega||)
daggari daggari ābĕ taga sevasesī nīgu
aggamai nī naṁdugĕllā ānaṁdiṁchevu
yĕggu siggulega mīge yidavulai vuṁḍum̐gāni
vŏggina nīlemalagu vŏraḍulai tom̐sunu
(||ega||)
kammaḍim̐ gammaḍi nābĕ kām̐giliṁchi kūḍam̐gānu
sammadiṁchi nīnaṁdugu sanavichchevu
immula śhrīveṁkaḍeśha yiṁpu mīgeyaum̐gāni
dŏmmigām̐gūḍinamāgu toḍunīḍai tom̐sunu