ఏకతానకు రారాదా యిప్పుడే కావలెనా
(॥పల్లవి॥)
ఏకతానకు రారాదా యిప్పుడే కావలెనా
కాకుసేసి యిందరిలోఁ గత లడిగేవు
(॥ఏక॥)
కనుఁగొనలనే నిన్ను కామిని జంకించఁగాను
చెనకేవు సారెసారెఁ జేయి చాఁచి
వనితలు చూడఁగాను వట్టిసిగ్గున నుండక
గొనకొని యాపెనేల కొంగువట్టేవు
(॥ఏక॥)
చక్కఁగా నీమోము చూచి సన్నలు సేయఁగాను
చెక్కిలి నొక్కి యిట్టె సేసవెట్టేవు
తక్కక నీ వింతలోనే తగ గుట్టుసేయక
వొక్కటై చన్నులనే వొరసుకొనేవు
(॥ఏక॥)
తీపుగారేమోవి చూపి తెరవేసుకొనఁగాను
చేపట్టి కాఁగిట నించి జీరదీసేవు
రాపుల శ్రీవేంకటేశ రతుల జంకించితివి
పైపై నింకా నెంత పసలు చూపేవు
(||pallavi||)
egadānagu rārādā yippuḍe kāvalĕnā
kāgusesi yiṁdarilom̐ gada laḍigevu
(||ega||)
kanum̐gŏnalane ninnu kāmini jaṁkiṁcham̐gānu
sĕnagevu sārĕsārĕm̐ jeyi sām̐si
vanidalu sūḍam̐gānu vaṭṭisigguna nuṁḍaga
gŏnagŏni yābĕnela kŏṁguvaṭṭevu
(||ega||)
sakkam̐gā nīmomu sūsi sannalu seyam̐gānu
sĕkkili nŏkki yiṭṭĕ sesavĕṭṭevu
takkaga nī viṁtalone taga guṭṭuseyaga
vŏkkaḍai sannulane vŏrasugŏnevu
(||ega||)
tībugāremovi sūbi tĕravesugŏnam̐gānu
sebaṭṭi kām̐giḍa niṁchi jīradīsevu
rābula śhrīveṁkaḍeśha radula jaṁkiṁchidivi
paibai niṁkā nĕṁta pasalu sūbevu