Egadaana numtiri meeriddaru nimdaamkaanu

ఏకతాన నుంటిరి మీరిద్దరు నిందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏకతాన నుంటిరి మీరిద్దరు నిందాఁకాను
జోకతో రారయ్య మీరు; చూచేను మీ రూపులు

(॥ఏక॥)
ఇంతిపాట లిందాఁకా నీడేర వింటివా
చెంత నామేలుకు సంతోసించుకొంటివా
బంతి నుండి యవి నీవు పాటములు గొంటివా
వింతలుగాఁ జెప్పవయ్య వినేను మీసుద్దులు

(॥ఏక॥)
మగువచేసిన సేవ మనసునఁ బట్టెనా
తగ నందు లోలుఁడవై తగిలితివా
మగుడియట్టె నీకు మర్మము గరఁగెనా
వెగటునా దానతీ వినేను మీసుద్దులు

(॥ఏక॥)
అలమేలుమంగ వురమందు నీకు నిలిచినా
కలఇకలెల్లా మెచ్చి కైకొంటివా
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వెలయ నాకెరుఁగించు వినేను మీసుద్దులు

(||pallavi||)
egadāna nuṁṭiri mīriddaru niṁdām̐kānu
jogado rārayya mīru; sūsenu mī rūbulu

(||ega||)
iṁtibāḍa liṁdām̐kā nīḍera viṁṭivā
sĕṁta nāmelugu saṁtosiṁchugŏṁṭivā
baṁti nuṁḍi yavi nīvu pāḍamulu gŏṁṭivā
viṁtalugām̐ jĕppavayya vinenu mīsuddulu

(||ega||)
maguvasesina seva manasunam̐ baṭṭĕnā
taga naṁdu lolum̐ḍavai tagilidivā
maguḍiyaṭṭĕ nīgu marmamu garam̐gĕnā
vĕgaḍunā dānadī vinenu mīsuddulu

(||ega||)
alamelumaṁga vuramaṁdu nīgu nilisinā
kala̮igalĕllā mĕchchi kaigŏṁṭivā
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vĕlaya nāgĕrum̐giṁchu vinenu mīsuddulu