ఈరీతి వలపు లొకటి కినుమడాయ । విభుఁడ
(॥పల్లవి॥)
ఈరీతి వలపు లొకటి కినుమడాయ । విభుఁడ
కోరికలు కోటానఁగోటి సతికాయ
(॥ఈరీ॥)
సుదతి నీరాక కెదురుచుచేటియాసలను
కదిసి నగుమోమెల్లఁగన్నులాయె
యిదె నీకడకు నాకె యేతెంచుఁ దమకమున
అదన మునిముంగిలెల్ల నడుగులే యాయ
(॥ఈరీ॥)
వెలది నీసుద్దెలెల్ల వినియేటివేడుకల
వెలలేనిపులకలే వీనులాయె
పలుమారు నీతోడఁ బలికేటికాంక్షలను
నిలువెల్ల నంగనకు నివ్వెరగులాయ
(॥ఈరీ॥)
కమలముఖి నీరతులఁ గలయునిబ్బరమునను
కొమరైన చన్నుగవ కొండలాయ
చెమటచే నిద్దరికి శ్రీవేంకటేశ్వరుడ
తమకమలు తనువులును తడబాటులాయె
(||pallavi||)
īrīdi valabu lŏgaḍi kinumaḍāya | vibhum̐ḍa
korigalu koḍānam̐goḍi sadigāya
(||īrī||)
sudadi nīrāga kĕdurususeḍiyāsalanu
kadisi nagumomĕllam̐gannulāyĕ
yidĕ nīgaḍagu nāgĕ yedĕṁchum̐ damagamuna
adana munimuṁgilĕlla naḍugule yāya
(||īrī||)
vĕladi nīsuddĕlĕlla viniyeḍiveḍugala
vĕlalenibulagale vīnulāyĕ
palumāru nīdoḍam̐ baligeḍigāṁkṣhalanu
niluvĕlla naṁganagu nivvĕragulāya
(||īrī||)
kamalamukhi nīradulam̐ galayunibbaramunanu
kŏmaraina sannugava kŏṁḍalāya
sĕmaḍase niddarigi śhrīveṁkaḍeśhvaruḍa
tamagamalu tanuvulunu taḍabāḍulāyĕ